Bigg Boss 5 Telugu: రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇస్తే వాళ్ల ముఖాన కొడ్తా: శ్రీరామ్‌

Bigg Boss Telugu 5: Sreerama Chandra Says He is Not Come Show For Win - Sakshi

Bigg Boss Telugu 5, Episode 11: కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ ఏమో కానీ బిగ్‌బాస్‌ కుస్తీల ప్రోగ్రామ్‌లా మారిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే వారి ఆటతో ప్రేక్షకులకు చెమట్లు పట్టించారు. అప్పటిదాకా స్నేహగీతం పాడుకున్నవాళ్లు కూడా బద్ధ శత్రువుల్లా మారిపోయారు. సైలెంట్‌గా కనిపించే శ్రీరామ్‌ శివాలెత్తిపోగా శ్వేత అందర్నీ ఓ ఆటాడించింది. కంటిచూపుతో గడగడలాడించే ఉమాదేవిపై దాడి చేయడంతో ఆమె కాళికా అవతారమెత్తింది. దీంతో మరోసారి యానీ మాస్టర్‌, ఉమాల మధ్య అగ్గి రాజుకుంది. మరి దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లో ఇచ్చిన మూడు లెవల్స్‌లో ఏ టీమ్‌ గెలిచింది? అనేది చూసేద్దాం..

సిగ్గుతో తల దించుకోవాలి..
దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లోని రెండో లెవల్‌ 'సాగరా సోదరా' టాస్క్‌లో నక్క(ఎల్లో) టీమ్ సభ్యులు ఎక్కువగా సాగదీసి నిలబడ్డారు. ఎల్లో టీం 33.3 మీటర్స్‌.. బ్లూ టీం 33 మీటర్స్ పొడువు ఉండగలిగాయి. అయితే ఇరువైపులా లెక్కలు తీసుకున్నాక మానస్‌ డన్‌ అనడంతో చివరి క్షణంలో శ్వేత కిందపడిపోయింది. అయితే అప్పటికే టాస్క్‌ అయిపోయింది కాబట్టి అది పరిగణనలోకి తీసుకోరని మానస్‌ టీమ్‌ ఎంత వారించినా అవతలి టీమ్‌ ఒప్పుకోలేదు. సంచాలకులు ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో టాస్క్‌ రద్దు చేస్తున్నట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. దీంతో శ్రీరామచంద్ర ఓవర్‌ ఎగ్జయిట్‌మెంట్‌లో డ్యాన్స్‌ చేశాడు. అతడి ప్రవర్తనకు చిర్రెత్తిన రవి టాస్క్‌ రద్దయినందుకు సిగ్గుతో తల దించుకోవాలని చురకలంటించాడు. సిగ్గు మీకు, కానీ మాకవసరం లేదు అని కౌంటరిచ్చింది ప్రియ.

నాతో మైండ్‌ గేమ్‌ ఆడకు: రవికి వార్నింగ్‌ ఇచ్చిన సింగర్‌
ఆ తర్వాత మళ్లీ 'పంతం నీదా నాదా' టాస్క్‌ మొదలు కాగా ఎల్లో టీమ్‌ రెచ్చిపోయి ఆడింది. ఈ క్రమంలో శ్వేత కొట్టిందని సిరి ఆరోపించింది. దీంతో తిక్క లేచిన ప్రియ.. సాయంత్రం కాగానే ఆమెకు దెయ్యం పూనుతుందని మండిపడింది. టాస్క్‌కు బ్రేక్‌ ఇచ్చిన తర్వాత యాంకర్‌ రవి.. శ్రీరామచంద్రతో ఉన్న గొడవను పరిష్కరించుకుందామని చూశాడు. కానీ అతడితో మాట్లాడటానికి కూడా పెద్దగా ఇష్టపడని శ్రీరామ్‌.. సేఫ్‌ గేమ్‌ ఆడుకో, నాతో మైండ్‌ గేమ్‌ ఆడకు అని సలహా ఇచ్చాడు. తాను తెలుగువాళ్లకు చేరువయ్యేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్నానే తప్ప గెలవడానికి రాలేదని, రూ.50 లక్షలు ఇచ్చినా వాళ్ల ముఖాన కొడ్తానని చెప్పాడు.

ఫ్యామిలీని గుర్తు చేసుకుని ఏడ్చేసిన లోబో
ఇక తర్వాతి రోజు శ్రీరామ్‌- మానస్‌ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. మానస్‌ను పిలిచి వయసెంత అని అడిగాడు శ్రీరామ్‌. అతడు 28 అని చెప్పాడు. అందుకే నీ ఏజ్‌ అడిగా, ఇప్పటికీ చిన్నపిల్లోడివే, నీకు మెచ్చురిటీ లేదని సింగర్‌ వ్యాఖ్యానించగా.. మీకు ఏజ్‌ పెరిగినా మెచ్యురెటీ లేదని రివర్స్‌ కౌంటరిచ్చాడు మానస్‌. మరోవైపు లోబో తన ఇంటిని గుర్తు చేసుకుని ఏడ్చేశాడు. తనకేమైనా ఐతే తన వాళ్లను చూసుకునే వాళ్లెవరూ లేరని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ తర్వాత ఆ గట్టునుంటావా? ఈ గట్టునుంటావా? టాస్క్‌ మొదలైంది. ఇందులో లోబో లేకుండానే గద్ద టీమ్‌ ఆడి గెలిచింది. దీంతో వారికి ఒక ఫ్లాగ్‌ వచ్చింది.

ఉమాదేవిపై దాడి, ఆమె ఊరుకుంటుందా!
అనంతరం 'పంతం నీదా నాదా' టాస్క్‌ తిరిగి ప్రారంభమైంది. ఇందులో ​అనుకోకుండా సన్నీ పింకీ చేయిని విసిరేయడంతో ఆమె కిందపడిపోయింది. అది చూసిన శ్రీరామ్‌.. పగిలిపోద్ది అని సన్నీని తిట్టాడు. తన మీద నోరు జారినందుకు సన్నీ ఆవేశపడుతుండగా.. మగాడివైతే ఆడుదువు రా అంటూ అతడిని మరింత రెచ్చగొట్టింది ప్రియ. పర్పుల్‌ టీమ్‌ మీద పడి పిల్లోస్‌ తీసుకోవాలని చూసిన ఉమాదేవిని ప్రియ ఓ వస్తువుతో కొట్టింది. తనను మాటంటేనే పడని ఉమా దెబ్బకు దెబ్బ తీయకుండా ఉంటుందా! తన మీద చేయి చేసుకున్న ఆ టీమ్‌ సభ్యులను ఉతికారేయాలని చూసింది. తనను కొడితే డ్రెస్సు చింపుతానని ఉమా అనడంతో యానీ మాస్టర్‌ రెచ్చిపోయింది. ఒసేయ్‌ ఉమా, సిగ్గు లేదా, థూ అని చీదరించుకుంది. మరోపక్క పర్పుల్‌ టీమ్‌ దగ్గరకు వచ్చిన శ్వేతను తన్నేందుకు ప్రయత్నించింది ప్రియ. రక్తాలు వచ్చేలా కొట్టుకు చస్తున్నా పట్టించుకోని బిగ్‌బాస్‌ అంతా అయిపోయాక మాత్రం హౌస్‌లో హింసకు తావు లేదంటూ హెచ్చరిక చేయడం గమనార్హం.

శ్రీరామ్‌తో మసాజ్‌ చేయించుకున్న హమీదా
ఈ టాస్క్‌ పూర్తయ్యే సమయానికి రెండు టీమ్స్‌ దగ్గరా 11 బెటాన్స్‌ ఉండటంతో ఇరు టీమ్స్‌కు ఐదు జెండాలు పంపించాడు బిగ్‌బాస్‌. ఇక రాత్రిపూట స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర కూర్చున్న శ్రీరామ్‌ హమీదాకు మసాజ్‌ చేశాడు. ఈ సందర్భంగా హమీదా.. నీ దగ్గర ఉండాలనిపిస్తుంది, కానీ అంతలోనే మళ్లీ దూరంగా ఉండాలనిపిస్తుంది అని మనసులోని మాట చెప్పింది. ఈ మాటతో గాల్లో తేలిపోయిన శ్రీరామ్‌.. ఇంకెవరైనా గుర్తొస్తే మాత్రం ఎవరి దగ్గరా ఉండకూడదు అని పంచ్‌ ఇవ్వడంతో ఫక్కున నవ్వేసింది హమీదా. వీరి మధ్య ఏమైనా మొదలువుతుందా? లేదా ఈ ఇద్దరిదీ స్నేహమేనా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-09-2021
Sep 15, 2021, 21:59 IST
ఇదే మంచి సమయం అనుకున్న హమీదా.. నీ దగ్గర ఉండాలనిపిస్తుంది, అంతలోనే మళ్లీ .... అని మనసులో మాట బయట...
15-09-2021
Sep 15, 2021, 20:27 IST
టాస్కు గెలిచేందుకు ఓ రకంగా యుద్ధమే చేస్తున్నారు కంటెస్టెంట్లు. స్నేహితులుగా ఉన్నవాళ్లు కూడా గేమ్‌లో బద్ధ శత్రువులుగా మారిపోయారు. మొత్తానికి... ...
15-09-2021
Sep 15, 2021, 19:11 IST
బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో నెవర్‌ బిఫోర్‌, ఎవర్‌ ఆఫ్టర్‌ అన్న రేంజ్‌లో కొట్లాటలు జరుగుతున్నాయి. తొలివారం నుంచే నోటికి...
15-09-2021
Sep 15, 2021, 18:28 IST
షణ్ముఖ్‌ మగాడై ఉండి, నంగనాచిగా ఎవరికీ తెలీకుండా దొంగచాటుగా గేమ్‌ను ఆపడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత మాత్రం సిరి దగ్గరకు వెళ్లి.. ...
15-09-2021
Sep 15, 2021, 17:14 IST
బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ను ఫాలో అవుతున్న అఖిల్‌ సార్థక్‌  ఈ సీజన్‌లో ఏ కంటెస్టెంట్‌కు సపోర్ట్‌ చేస్తున్నాడో...
15-09-2021
Sep 15, 2021, 16:25 IST
అప్పటికే బాగా హర్ట్‌ అయిన శ్రీరామచంద్ర అతడి మాటలు వినడానికి కూడా ఇష్టం చూపలేదు. సేఫ్‌ గేమ్‌ ఆడాలనుకుంటే ఆడు,...
15-09-2021
Sep 15, 2021, 00:06 IST
బిగ్‌బాస్‌ అంటేనే వివాదాలు.. కాంట‍్రవర్సీలు.. ఒకరినొకరు అరుచుకోవడం. ఎంత ప్రేమగా ఉండాలని చూసినా వారి మధ్య చిచ్చు పెడతాడు బిగ్‌బాస్‌....
14-09-2021
Sep 14, 2021, 21:27 IST
బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ తొలివారాన్ని దిగ్విజయంగా ముగించుకుంది. ఫస్ట్‌వీక్‌లో ఊహించని విధంగా  సరయుని బయటకు పంచించేశాడు బిగ్‌బాస్‌. అందరిని దమ్‌దబ్‌...
14-09-2021
Sep 14, 2021, 18:24 IST
బిగ్‌బాస్‌-5 హౌస్‌లో అందరు ఒకెత్తు అయితే.. యాంకర్‌ లహరి మరో ఎత్తు. ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది....
14-09-2021
Sep 14, 2021, 17:10 IST
బిగ్‌ బాస్‌ షోలో కొన్ని టాస్క్‌లు కాస్త కఠినంగా ఉంటాయి. కంటెస్టెంట్స్‌ వాటిని చాలెంజ్‌గా తీసుకొని వందశాతం ఎఫెర్ట్స్‌ పెట్టి...
14-09-2021
Sep 14, 2021, 00:25 IST
 నటరాజ్‌ మాస్టర్‌.. ప్రియ మంచి కోసం చెప్పినా తను నన్ను పక్కకు పిలిచి తిట్టేదని, అక్కడ హర్టయ్యాను అంటూ ఆమెను నామినేట్‌...
13-09-2021
Sep 13, 2021, 21:28 IST
Bigg Boss Telugu 5, Sarayu Remuneration: వంద రోజులుంటానని కొండంత ఆశతో బిగ్‌బాస్‌ షోలో అడుగు పెట్టింది యూట్యూబర్‌ సరయూ. కానీ...
13-09-2021
Sep 13, 2021, 20:02 IST
ఒక్కవారంలోనే కంటెస్టెంట్లను జడ్జ్‌ చేయడం సరికాదని బిగ్‌బాస్‌ వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. పైగా నామినేషన్స్‌లోకి వచ్చినవారిలో కొందరిని బిగ్‌బాస్‌ కావాలని..
13-09-2021
Sep 13, 2021, 18:50 IST
'దమ్ము, ధైర్యం, బుద్ధిబలం, సత్తా ఉన్నవాళ్లు నాతో ఆడటానికి ట్రై చేయండి' అని సవాలు విసిరింది. దీంతో చిర్రెత్తిన పింకీ.. పోవే...
13-09-2021
Sep 13, 2021, 17:57 IST
యాంకర్‌ రవి.. మంచోడిలాగా నీతి సూత్రాలు బోధిస్తాడు, కానీ అతడి దగ్గర విషయమే లేదు. వీజే సన్నీకి అసలు క్యారెక్టరే...
13-09-2021
Sep 13, 2021, 17:05 IST
Bigg Boss Telugu 5, Second Week Nominations: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ కంటెస్టెంట్‌...
13-09-2021
Sep 13, 2021, 16:25 IST
సండే అసలైన ఫండే అంటాడు కింగ్‌ నాగార్జున. కానీ బిగ్‌బాస్‌ ప్రేమికులకు మాత్రం అసలు సిసలైన ఫండే సోమవారం అనే...
12-09-2021
Sep 12, 2021, 23:57 IST
లహరిని ఓ రేంజ్‌లో ఆడుకుంది. ఏమీ లేని అరిటాకు ఎగిరెగిరి పడుతుందట, అంత ఈగో ఏంటి? ఆ టోన్‌ మార్చుకో,...
12-09-2021
Sep 12, 2021, 23:22 IST
లోబో.. ఇంట్లో వాళ్లకు ముద్దుపేర్లు పెట్టాడు. కాజల్‌.. ఎలుక, సరయూ.. తొండ, సిరి.. సీతాకోక చిలుక, జెస్సీ.. పిల్లి...
12-09-2021
Sep 12, 2021, 22:23 IST
అంతపెద్ద షోలో పచ్చి బూతులు మాట్లాడటాన్ని కూడా చాలామంది తప్పుగా భావించారు. దీనివల్ల కూడా ఆమె ఓట్లకు గండి పడిందనేది...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top