Bigg Boss 5 Telugu: ఆ ఇద్దరు భార్యలు, ఈ ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌: శ్రీరామ్‌

Bigg Boss Telugu 5: Sreerama Chandra, Jessie Select Kajal As Maid - Sakshi

Bigg Boss 5 Telugu, Episode 13: మానస్‌లో చాలా మార్పొచ్చిందని శ్రీరామ్‌తో ముచ్చట్లు పెట్టాడు విశ్వ. మరోవైపు ఇంటిసభ్యులను ఇమిటేట్‌ చేస్తూ శ్వేతను తెగ నవ్వించాడు జెస్సీ. అతడిలో ఈ టాలెంట్‌ చూసిన శ్వేత.. నీలో చాలా షేడ్స్‌ ఉన్నాయిరా అని కామెంట్‌ చేసింది. అనంతరం రెండోవారం లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ మొదలైంది. ఇందులో భాగంగా స్క్రీన్‌పై చూపించిన కంటెస్టెంట్లు బజర్‌ మోగగానే బంతిని పట్టుకోవాలి. పట్టుకున్న బంతిపై ఏ ఫుడ్‌ రాసి ఉంటుందో దాన్ని మాత్రమే పంపిస్తాడు బిగ్‌బాస్‌. టాస్క్‌ స్టార్ట్‌ అవగానే విశ్వ, లహరి, లోబో, సిరి.. ఎవరూ బాల్‌ పట్టుకోలేకపోయారు. కానీ నటరాజ్‌ మాస్టర్‌, ప్రియాంక మాత్రం బాల్‌ క్యాచ్‌ చేసి ఇంట్లో వాళ్లకు ఫుడ్‌ దొరికేలా చేశారు.

ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ మొదలైందిగా..
ఇదిలా వుంటే శ్రీరామచంద్ర నీమీద ఆసక్తి చూపిస్తున్నాడంటూ కాజల్‌ హమీదాతో చెప్పింది. సన్నీ కూడా నిన్ను తెగ ఇష్టపడతాడని యానీ మాస్టర్‌ నొక్కి చెప్పింది. అయితే హమీదా మాత్రం తనకు సన్నీ బెస్ట్‌ ఫ్రెండ్‌ మాత్రమేనని చెప్పాడు. వీళ్ల మాటలను చూస్తుంటే హౌస్‌లో ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ మొదలైనట్లే కనిపిస్తోంది. తర్వాత బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో బెస్ట్‌, వరస్ట్‌ పర్ఫామర్‌ పేర్లను ఎంచుకోమన్నాడు. దీంతో విశ్వ, హమీదా.. షణ్ముఖ్‌ను; శ్రీరామచంద్ర, మానస్‌, సన్నీ, యాంకర్‌ రవి, లోబో.. నటరాజ్‌ మాస్టర్‌ను; లహరి, షణ్ముఖ్‌.. మానస్‌ను; ప్రియ, సిరి, నటరాజ్‌ మాస్టర్‌, ప్రియాంక సింగ్‌.. శ్రీరామచంద్రను; ఉమాదేవి, శ్వేత వర్మ.. జెస్సీని బెస్ట్‌ పర్ఫామర్లుగా పేర్కొన్నారు. ఎక్కువ ఓట్లు సాధించిన నటరాజ్‌ మాస్టర్‌ ఈ వారం బెస్ట్‌ పర్ఫామర్‌గా ఎంపికయ్యాడు.

వరస్ట్‌ పర్ఫామర్‌గా సన్నీ
అనంతరం చెత్త ఆటగాడిని ఎంచుకోవాల్సి రాగా, మొదటగా కెప్టెన్‌ విశ్వ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. పింకీ త్వరగా రెడీ అయితే బాగుంటుందని సూచిస్తూ ఆమెను వరస్ట్‌ పర్ఫామర్‌గా పేర్కొన్నాడు. ఇది మింగుడుపడని పింకీ.. తాను చాలా తక్కువగా రెడీ అవుతానని, ఎంత రెడీ అయినా తనెప్పుడూ అందరికీ సమయానికి వంట సిద్ధం చేశానని స్పష్టం చేసింది. తర్వాత యాంకర్‌ రవి.. యాటిట్యూడ్‌ చూపించాడంటూ సన్నీని ఎంచుకున్నాడు. శ్వేత.. సిరిని; మానస్‌.. టాస్క్‌లో సహనాన్ని కోల్పోయిన శ్రీరామ్‌ను; ఉమాదేవి, కాజల్‌, షణ్ముఖ్‌, ప్రియ, సిరి.. సన్నీని; యానీ మాస్టర్‌.. ఉమాదేవిని; శ్రీరామచంద్ర.. యాంకర్‌ రవిని వరస్ట్‌ పర్ఫామర్లుగా అభిప్రాయపడ్డారు. అయితే ఎక్కువ ఓట్లు వచ్చిన సన్నీని ఈవారం వరస్ట్‌ పర్ఫామర్‌గా ప్రకటించడంతో అతడిని జైల్లో బందీని చేశారు.

వామ్మో, ఈమె ఎన్ని అబద్ధాలు ఆడుతోంది: ప్రియ
కిచెన్‌లో జరిగిన విషయాల గురించి కాజల్‌, ప్రియ డిస్కషన్‌ చేశారు. అది కాస్తా గొడవగా మారి సంస్కారం అంటూ పెద్దపెద్ద మాటలు అనుకునేదాకా వెళ్లింది. ముందు ఒకలా, వెనుక ఒకలా మాట్లాడుతూ సింపతీ గేమ్‌ ఆడాలని చూడకు అంటూ కాజల్‌పై బాగానే ఫైర్‌ అయింది ప్రియ. వామ్మో, ఈమె సెకనుకో అబ​ద్ధం ఆడుతుందని కామెంట్‌ చేసింది. దీంతో కాజల్‌ ఏడుపు ఆపుకోలేకపోయింది. కానీ అంతలోనే ప్రియ వచ్చి సారీ చెప్పి ఈ గొడవను అక్కడితో ముగించింది.

పెళ్లి కాకపోయుంటే ఆమెకు సైట్‌ కొట్టేవాడిని: రవి
తర్వాత బిగ్‌బాస్‌... ఇంటిసభ్యులు మనసు విప్పి మాట్లాడండంటూ బీబీ న్యూస్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో రవి, కాజల్‌ రిపోర్టర్లుగా వ్యవహరించాల్సి ఉంటుంది. టాస్క్‌ మొదలవగానే.. కాజల్‌, రవి.. తమ వాగ్ధాటితో రెచ్చిపోయారు. పెళ్లి కాకపోయుంటే ఇంట్లో ఎవరికి సైట్‌ కొట్టేవాళ్లు అని కాజల్‌ రవిని ప్రశ్నించగా అతడు ఎంతో తెలివిగా తిరిగి ఆమె పేరే చెప్పాడు. దీంతో అవాక్కైన కాజల్‌ అంత సీన్‌ లేదులే అని నవ్వేసింది. తర్వాత యానీ మాస్టర్‌.. తనకు హౌస్‌లో పెద్ద కూతురు దొరికిందంటూ శ్వేత గురించి చెప్పింది. పనిలో పనిగా శ్రీరామ్‌, హమీదా, సన్నీ మధ్యలో ట్రయాంగిల్‌ స్టోరీ నడుస్తుందని ఓ సీక్రెట్‌ను బయటపెట్టేసింది.

ఇద్దరు భార్యలు, ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌: శ్రీరామ్‌
లోబో.. ఉమాదేవి తన లవర్‌ అని పరిచయం చేశాడు. తమ జోడీ తర్వాత ఇంట్లో మానస్‌, ప్రియాంక లవ్‌స్టోరీ బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. తర్వాత శ్రీరామచంద్ర ప్రేమ గురించి మాట్లాడుతూ.. ఫస్ట్‌ వీక్‌లో సిరి, హమీదా మీద, తర్వాత అమ్ము(లహరి) మీద, ఇప్పుడు ప్రియ మీద లవ్‌ స్టార్ట్‌ అయిందని చెప్పుకొచ్చాడు. ఇంట్లో ఉన్నవాళ్లలో భార్య, గర్ల్‌ఫ్రెండ్‌, బెస్ట్‌ ఫ్రెండ్‌, పని మనిషిగా ఎవరు సెట్ అనుకుంటున్నారో చెప్పమని రవి ప్రశ్నించాడు. దీనికి శ్రీరామ్‌ ఏమాత్రం తడుముకోకుండా లహరి, ప్రియ భార్యగా, సిరి, హమీదా గర్ల్‌ఫ్రెండ్స్‌గా, శ్వేత బెస్ట్‌ ఫ్రెండ్‌గా, కాజల్‌ పని మనిషిగా ఉంటే బాగుంటుందని టపీమని చెప్పాడు. దీంతో యాంకర్‌ రవి.. శ్రీరామచంద్ర ఇంటి పనిమనిషిగా కాజల్‌ వస్తే బాగుంటుందన్నాడంటూ నానా హల్‌చల్‌ చేశాడు. దీంతో కాజల్‌ ముఖం వాడిపోయింది.

శ్రీరామ్‌తో డ్యాన్స్‌ చేసిన హమీదా
మానస్‌.. సిరి బెస్ట్‌ఫ్రెండ్‌, ప్రియాంక మరదలు, హమీదా ప్రేయసి, లహరి భార్య అయితే బాగుంటుందన్నాడు. సన్నీ.. శ్వేతను భార్యగా, హమీదాను గర్ల్‌ఫ్రెండ్‌గా, సిరిని పనిమనిషిగా సెలక్ట్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత జెస్సీ.. సిరిని గర్ల్‌ఫ్రెండ్‌గా, కాజల్‌ను పని మనిషిగా ఎంచుకున్నాడు. మొత్తానికి అందరూ కలిసి కాజల్‌ను పనిమనిషిని చేశారు. ఇక శ్రీరామచంద్ర, షణ్ముఖ్‌లలో ఎవరిని సెలక్ట్‌ చేసుకుంటావన్న ప్రశ్నకు హమీదా వెంటనే శ్రీరామ్‌ అని ఒక్క ముక్కలో చెప్పేసింది. అంతే కాదు.. శ్రీరామచంద్ర, హమీదా ఇద్దరూ రొమాంటిక్‌ పాటకు తెగ ఫీలైపోయి డ్యాన్స్‌ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top