Bigg Boss Telugu 5: నన్ను చీడపురుగులా చూస్తున్నారు.. ఏడ్చేసిన కాజల్‌

Bigg Boss Telugu 5: RJ Kajal In Jail After Becomes Worst Performer - Sakshi

Bigg Boss Telugu 5, Episode 34: ప్రతివారం బిగ్‌బాస్‌ హౌస్‌లో బెస్ట్‌, వరస్ట్‌ పర్ఫామర్లను ఎన్నుకుంటున్న సంగతి తెలిసిందే కదా! ఈ వారం కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. కానీ బెస్ట్‌గా ఆడినవాళ్లను అలా ఉంచి ఎవరు చెత్తగా ఆడారో చెప్పమని ఆదేశించాడు బిగ్‌బాస్‌. ఈ క్రమంలో కాజల్‌తో మాకసలు కనెక్షనే వద్దంటూ ఆమెకు దండం పెట్టేశారు హౌస్‌మేట్స్‌. నేటి ఎపిసోడ్‌ చూస్తుంటే దాదాపు హౌస్‌మేట్స్‌ అంతా కలిసి కాజల్‌ మీద దండయాత్ర చేసినట్లే కనిపించింది. మరి కాజల్‌ వీటిని ఎలా ఎదుర్కొంది? నేటి(అక్టోబర్‌ 08) ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదవాల్సిందే!

గోరుముద్దలు పెడతానంటే గోల చేసిన మానస్‌
బిగ్‌బాస్‌ ఇచ్చిన ప్రత్యేక అధికారంతో కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచిన ప్రియ హౌస్‌లో కొత్త కెప్టెన్‌గా అవతరించింది. మరోపక్క టాస్క్‌లో శ్వేత తనకు సపోర్ట్‌ ఇవ్వలేదని తెగ ఫీలయ్యాడు సన్నీ. ఈ క్రమంలో మానస్‌, సన్నీ తెగ ఏడ్చేశారు. ఎందుకింత ఎమోషనల్‌ అవుతున్నారో అర్థం కాని లోబో, విశ్వ వారిని ఊరడించేందుకు ప్రయత్నించారు. మరోపక్క పింకీ మానస్‌కు తినిపించాలని ఎంతో ప్రేమకొద్దీ ప్లేటు పట్టుకుని వెళ్లింది. కానీ అతడు మాత్రం తనకు వద్దని కటువుగా ఆన్సరివ్వడంతో చిన్నపిల్లలా ఏడ్చేసింది.

బలిపీఠం ఎక్కించి నీళ్లు గుమ్మరించాలి..
ఇక సన్నీ, శ్వేత.. వారిమధ్య వచ్చిన మనస్పర్థలను చెరిపేసుకుని తిరిగి మామూలు ఫ్రెండ్స్‌లా మారిపోయారు. గేమ్‌లో అన్నీ సాధారణమేనంటూ తిరిగి కలిసిపోయారు. అనంతరం బిగ్‌బాస్‌.. ఈ వారం వరస్ట్‌ పర్ఫామర్‌ను ఎన్నుకుని జైలుకు పంపించాల్సి ఉంటుందని ఆదేశించాడు. అందులో భాగంగా.. కంటెస్టెంట్లు దోషి అనుకుంటున్న వ్యక్తులను బలిపీఠం ఎక్కించి, అందుకు తగిన కారణాలు చెప్పి, వారి ముఖం మీద నీళ్లు చల్లాల్సి ఉంటుంది.

దయచేసి ఫ్రెండ్‌షిప్‌ను చెడగొట్టవద్దు
మొదటగా వచ్చిన శ్వేత.. తనకు, సన్నీ, యానీకి మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఉందని, దాన్ని ఇన్‌ఫ్లూయెన్స్‌తో చెడగొట్టవద్దని కాజల్‌కు హితవు పలికింది. తర్వాత వచ్చిన జెస్సీ.. నా ఫుడ్‌ నన్ను వండుకోమని ఆర్డర్‌ చేయడం నచ్చలేదంటూ శ్రీరామ్‌ను వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు. ఈ క్రమంలో శ్రీరామ్‌, జెస్సీకి మధ్య పెద్ద ఫైటే నడిచింది. ఇక టాస్క్‌లో చిల్లర, థూ అంటూ మాటలు జారడం నచ్చలేదని విశ్వను వరస్ట్‌ పర్ఫామర్‌గా నామినేట్‌ చేశాడు షణ్ముఖ్‌, సిరి, ప్రియ. అనంతరం హమీదా.. మన మధ్య ఏ రిలేషన్‌ ఉండొద్దంటూ కాజల్‌ ముఖం మీద నీళ్లు గుమ్మరించింది.

ఇక నుంచి ఆ రిలేషన్‌ కూడా వద్దు: కాజల్‌
శ్రీరామ్‌.. కాజల్‌ను వరస్ట్‌ పర్ఫామర్‌గా పేర్కొనడంతో ఆమె బాగా హర్టయ్యింది. ఇక నుంచి మన మధ్య బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ రిలేషన్‌ కూడా వద్దని తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఆమె దెబ్బకు దెబ్బ అన్న రీతిలో శ్రీరామ్‌నే వరస్ట్‌ పర్ఫామర్‌గా అభిప్రాయపడింది. 'నువ్వు నన్ను చీడపురుగులా చూస్తావు, అనుమానిస్తావు.. ఇకనుంచి నిన్ను బ్రదర్‌ అని పిలవను' అని చెప్తూ అతడి ముఖం మీద నీళ్లు గుమ్మరించింది.

తన కోపాన్ని చూపించలేక యానీ మాస్టర్‌ వింత ప్రవర్తన
కాజల్‌ను వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎన్నుకున్న యానీ మాస్టర్‌ ఆమె మీద కోపంతో తన ముఖం మీద తానే నీళ్లు గుమ్మరించుకుంది. తర్వాత ప్రియాంక సింగ్‌.. విశ్వ నోరు జారాడంటూ వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎన్నుకుంది. అనంతరం వచ్చిన లోబో.. టాస్క్‌లో రవిని వెన్నుపోటు పొడిచావంటూ కాజల్‌ మీద నీళ్లు పోశాడు. ఇక రవి వంతురాగా.. నేను కిచెన్‌లో పని చేయలేదని స్టేట్‌మెంట్‌ ఇవ్వడం తప్పు అంటూ కాజల్‌ను నిందించాడు. దీంతో ఆమె ముందు నన్ను ఫ్రెండ్‌ అని పిలవడం మానేయమని హెచ్చరించింది. దీంతో చిర్రెత్తిపోయిన రవి.. నామీదకు చేయి ఎత్తొద్దు అని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. 

ఉద్వేగానికి లోనైన కాజల్‌..
శ్రీరామ్‌ సంచాలకుడిగా సరిగా పని చేయట్లేదంటూ మానస్‌, సన్నీ అతడిని వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు. తర్వాత వచ్చిన విశ్వ కూడా కాజల్‌ను వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు. అయితే హౌస్‌లో ఇంతమంది తనను వరస్ట్‌ అనుకుంటున్నారని అర్థమైన కాజల్‌ తన కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఎక్కువమంది దోషిగా అభిప్రాయపడ్డ కాజల్‌ను బిగ్‌బాస్‌​ జైల్లో వేయమని చెప్పగానే కంటతడి పెట్టుకుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top