Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ప్రియ ఇంట పెళ్లి ఫంక్షన్‌

Bigg Boss Telugu 5: BB Contestant Priya Hungama In Relative Marriage - Sakshi

సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ప్రియ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రియకు ఇటీవల బిగ్‌బాస్‌ షో నుంచి పిలుపు వచ్చింది. వెంటనే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ షోలో వాలిపోయింది. అక్కడ ఇతర కంటెస్టెంట్లను, వారి గేమ్‌ను అంచనా వేస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గేమాడింది ప్రియ. కెప్టెన్సీ కాలేరని తెలిసినా చిరునవ్వుతో ఆ నిర్ణయాన్ని స్వాగతించి ఎందరో మనసులను కొల్లగొట్టింది. చివరకు అసాధ్యం అనుకున్న కెప్టెన్సీని సైతం సుసాధ్యం చేస్తూ ఐదో వారం కెప్టెన్‌గా అవతరించింది.

కానీ సన్నీతో వైరం కొనితెచ్చుకుని అతడి మీద నోరు పారేసుకోవడంతో అప్రతిష్ట మూటగట్టుకుంది. టాస్క్‌లో అతడిని రెచ్చగొట్టడం, చెంప పగలగొడతానంటూ హెచ్చరించడంతో సోషల్‌ మీడియాలోను ఆమెను ట్రోల్‌ చేశారు. ఫలితంగా ఓట్లు తగ్గి ఏడో వారంలో షో నుంచి ఎలిమినేట్‌ అయింది.

ఇదిలా వుంటే నేడు(నవంబర్‌ 21న) ప్రియకు వరుసకు కూతురయ్యే లోహిత పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలకు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు జెస్సీ, ఉమాదేవి, సరయు విచ్చేశారు. పెళ్లి వేడుకల్లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 'మా ఇంట్లో పెళ్లి వేడుకలు షురూ' అంటూ ఇంటి ముందు ముగ్గులేసిన ఫొటోను ప్రియ ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. హల్దీ, మెహందీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సైతం ఎప్పటికప్పుడు పంచుకుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top