బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి చార్లీ! | Bigg Boss Kannada 10: Charlie is First Contestant of BB | Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్‌బాస్‌ షోలో మొదటి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వనున్న చార్లీ.. అధికారిక ప్రకటన..

Sep 24 2023 1:42 PM | Updated on Sep 25 2023 4:17 PM

Bigg Boss Kannada 10: Charlie is First Contestant of BB - Sakshi

సినిమాలో చార్లీ జనాలను ఎంతగా ఏడిపించిందో అందరికీ తెలిసిందే! తన చేష్టలతో హీరోపై ఎంతో ప్రేమను కురిపించిన ఈ మూగజీవి ఇప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌

బిగ్‌బాస్‌ షో.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ షో ఒక ఎమోషన్‌. ఎన్ని పనులున్నా సరే బిగ్‌బాస్‌ స్టార్ట్‌ అవుతుందనగానే టీవీలకు అతుక్కుపోతారు. ఈ షోకి అంతలా కనెక్ట్‌ అయిపోయారు. తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ ప్రస్తుతం ఏడో సీజన్‌ కొనసాగుతోంది. మలయాళంలో ఇటీవలే ఐదో సీజన్‌ పూర్తయింది. తమిళంలోనూ ఏడో సీజన్‌ త్వరలోనే షురూ కానుంది. కన్నడలో పదవ సీజన్‌ అక్టోబర్‌ 8 నుంచి ప్రారంభం కానుంది. ఇకపోతే కన్నడ బిగ్‌బాస్‌లో ఎవరెవరు పార్టిసిపేట్‌ చేయనున్నారు? ఎంతమంది వస్తారంటూ అప్పుడే రూమర్స్‌ మొదలయ్యాయి.

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మూగజీవి
ఈసారి హౌస్‌లోకి 17 మంది కంటెస్టెంట్లు ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా బిగ్‌బాస్‌ టీమ్‌.. హౌస్‌లోకి వెళ్లే తొలి కంటెస్టెంట్‌ ఎవరన్నది ముందుగానే అధికారికంగా ప్రకటించింది. ఆ కంటెస్టెంట్‌ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినవారే! 777 చార్లీ సినిమాతో ఆకట్టుకున్న చార్లీ అనే శునకం షోలో ఎంట్రీ ఇస్తోందట! సినిమాలో చార్లీ జనాలను ఎంతగా ఏడిపించిందో అందరికీ తెలిసిందే! తన చేష్టలతో హీరోపై ఎంతో ప్రేమను కురిపించిన ఈ మూగజీవి ఇప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వస్తుందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్‌.

టీఆర్పీ కోసమేనా?
షోలోకి చార్లీ వస్తున్నాడంటే ఏమైనా స్పెషల్‌ ఉందా? అని అడుగుతున్నారు. బిగ్‌బాస్‌ చరిత్రలోనే ఇంతవరకు ఏ మూగజీవాలను హౌస్‌లోకి పంపించలేదు. అలాంటిది తొలిసారి చార్లీ హౌస్‌లో అడుగుపెడుతుండటంతో అభిమానులు ఎగ్జయిట్‌ అవుతున్నారు. చార్లీకి శుభాకాంక్షలు చెప్తున్నారు. టీఆర్పీలు బద్ధలు కొట్టడానికే ఈ ప్లాన్‌ వేసినట్లు కనిపిస్తోంది. మరి చార్లీ.. కన్నడ బిగ్‌బాస్‌ 10వ సీజన్‌ లాంచ్‌ రోజు గెస్ట్‌గా హౌస్‌లోకి వెళ్లి వస్తాడా? లేదంటే కంటెస్టెంట్‌గా హౌస్‌లో ఉంటాడా? అసలు బిగ్‌బాస్‌ ప్లానేంటి? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే!


చదవండి: ఇండస్ట్రీలో మంచి ఛాన్సులు, గుర్తింపు రావట్లేదని చనిపోదామనుకున్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement