చెత్త రీజన్స్‌, చెత్త నామినేషన్స్‌.. కాకపోతే ఓ ట్విస్ట్‌! | Bigg Boss 6 Telugu: Ego Fight Between Sri Satya, Keerthi In Nomination | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: నామినేషన్స్‌లో తగ్గని వెటకారం, కీర్తి, శ్రీసత్య ఇగో ఫైట్‌

Published Mon, Nov 14 2022 11:42 PM | Last Updated on Mon, Nov 14 2022 11:47 PM

Bigg Boss 6 Telugu: Ego Fight Between Sri Satya, Keerthi In Nomination - Sakshi

Bigg Boss 6 Telugu, Episode 72: బిగ్‌బాస్‌ హౌస్‌లో  టాప్‌ 10 కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక మీదట గేమ్‌ మరింత రంజుగా మారనుంది. అసలైన నామినేషన్స్‌ హీట్‌ ఇప్పుడు మొదలు కానుంది అనుకుంటే అంతా తలకిందులైంది. ఈరోజు నామినేషన్స్‌ అసలు నామినేషన్స్‌లానే లేవు. ఇస్తినమ్మా వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అన్నట్లుగా నువ్వు నాకు వేశావు, నేను నీకు వేస్తున్నా అన్నట్లుగా ఒకరినొకరు నామినేట్‌ చేసుకున్నారు. మరి ఎవరు ఎవర్ని నామినేట్‌ చేశారో తెలియాలంటే ఇది చదివేయండి..

నాకు బాగా క్లోజ్‌ అయినవారందరూ వెళ్లిపోతున్నారు. గీతూ, బాలాదిత్య ఇద్దరూ వెళ్లిపోయారు, అంటే నేను కూడా వెళ్లిపోతానని హింటిస్తున్నావా బిగ్‌బాస్‌? అని తనలో తనే మదనపడ్డాడు ఆది రెడ్డి. అనంతరం ఇంట్లో నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇంట్లో ఉండి వ్యర్థం అనుకున్న ఇద్దరు ఇంటిసభ్యులపై చెత్త బుట్ట గుమ్మరించాలన్నాడు బిగ్‌బాస్‌. ముందుగా ఫైమా.. బూతు మాట్లాడావంటూ రోహిత్‌ను నామినేట్‌ చేసింది. రోజులు గడిచేకొద్దీ నీ కసి కోపంగా మారుతోంది. గేమ్‌ను పర్సనల్‌గా తీసుకుని కావాలని ఫిజికల్‌ అవుతున్నావంటూ ఇనయపై చెత్త గుమ్మరించింది.

► ఆదిరెడ్డి.. శ్రీహాన్‌, రోహిత్‌
► ఇనయ.. ఆదిరెడ్డి, రాజ్‌
► శ్రీహాన్‌.. రోహిత్‌, కీర్తి
► మెరీనా.. రేవంత్‌, ఇనయ
► రాజ్‌.. మెరీనా, ఇనయ
► శ్రీసత్య.. ఇనయ, కీర్తి
► రోహిత్‌.. రేవంత్‌, ఆదిరెడ్డి
► కీర్తి.. శ్రీసత్య, మెరీనా
► రేవంత్‌.. రోహిత్‌, మెరీనాలను నామినేట్‌ చేశారు.

ఈ నామినేషన్స్‌లో కీర్తి- శ్రీసత్యల మధ్య ఇగో ఫైట్‌ నడిచింది. గేమ్‌ ఓడిపోయిన కోపంలో బూతులు మాట్లాడాడన్న కారణంతోనే రోహిత్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. అటు ఇనయది కూడా అదే పరిస్థితి. ఆవేశంలో నోటి నుంచి బూతులు వచ్చేస్తున్నాయి, కాస్త చూసుకోమని హెచ్చరించారు ఇంటిసభ్యులు. అంతకు మించి పెద్దగా వాదనలేమీ జరగలేదు.

ఫైనల్‌గా ఈ వారం కెప్టెన్‌ ఫైమా మినహా ఇనయ, రోహిత్‌, మెరీనా, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీహాన్‌, శ్రీసత్య, రేవంత్‌, రాజ్‌లు నామినేషన్‌లో ఉన్నారు. కాకపోతే ఓటింగ్‌ లైన్లు రేపు రాత్రి ఓపెన్‌ కానున్నాయి. అంటే నామినేషన్స్‌లో నుంచి సేవ్‌ అయ్యేందుకు హౌస్‌మేట్స్‌కు ఓ సువర్ణావకాశం ఇవ్వనున్నాడు బిగ్‌బాస్‌. మరి ఈ ఛాన్స్‌ ఎవరు దక్కించుకుంటారో చూడాలి!

చదవండి: బాలాదిత్య, వాసంతిల పారితోషికం ఎంతో తెలుసా?
సినిమాలకు బ్రేక్‌, హీరో షాకింగ్‌ నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement