బిగ్‌బాస్‌ 5 విజేత అతడే అంటున్న గూగుల్‌! | Bigg Boss 5 Telugu Winner Declared By Google: Details Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ విన్నర్‌ను ప్రకటించిన గూగుల్‌!

Sep 23 2021 8:00 PM | Updated on Sep 25 2021 12:13 AM

Bigg Boss 5 Telugu Winner Declared By Google: Details Inside - Sakshi

Bigg Boss 5 Telugu Winner Name: బిగ్‌బాస్‌ షో మొదలై కేవలం రెండు వారాలే అవుతున్నప్పటికీ గూగుల్‌ మాత్రం అప్పుడే సీజన్‌ విజేతను ప్రకటించేసింది...

తెలుగులో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ మధ్యే ప్రారంభమైంది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం 17 మంది ఉన్నారు. బిగ్‌బాస్‌ ఏ చిన్న టాస్క్‌ ఇచ్చినా నువ్వానేనా అన్న రీతిలో పర్ఫామ్‌ చేస్తున్నారు. టైటిల్‌ ఎలాగైనా సాధించి తీరాలని కసితో ఆడుతున్నారు. అయితే గూగుల్‌ మాత్రం అప్పుడే ఈ సీజన్‌ విజేతను ప్రకటించేసింది. షో మొదలై కేవలం రెండు వారాలే అవుతున్నప్పటికీ సింగర్‌ శ్రీరామచంద్ర విన్నర్‌ అని డిక్లేర్‌ చేసింది. ఇది బుల్లితెర ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తోంది. శ్రీరామ్‌ అభిమానులు మాత్రం గూగుల్‌ ఈ విషయాన్ని ముందే పసిగట్టేసింది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. గూగుల్‌లో బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ విన్నర్‌ ఎవరని టైప్‌ చేయగా అది శ్రీరామచంద్ర పేరును సూచిస్తోంది. శ్రీరామ్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌, నటుడు అని, అంతేకాకుండా ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 5 విజేత కూడా అంటూ అతడి వివరాలను సైతం చూపిస్తోంది. ఇక ఇదే గూగుల్‌లో బిగ్‌బాస్‌ 5 తెలుగు టైటిల్‌ విన్నర్‌ ఎవరని టైప్‌ చేయగా ప్రియాంక సింగ్‌ను విజేతగా చూపిస్తోంది.

ఈ గూగుల్‌ తప్పిదాలపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. కాగా శ్రీరామచంద్రకు ప్రస్తుతం షోలో మంచి ఫుటేజీ దక్కుతోంది. హమీదాతో లవ్‌ ట్రాక్‌ నడుపుతుండటంతో కావాల్సినంత స్క్రీన్‌ స్పేస్‌ దొరుకుతోంది. అటు టాస్క్‌ల్లోనూ బాగా పర్ఫామ్‌ చేస్తున్నాడు. మరి గూగుల్‌ చెప్పినట్లుగా రానున్న రోజుల్లో శ్రీరామ్‌ లేదా ప్రియాంక సింగ్‌ బిగ్‌బాస్‌ విజేతగా అవతరిస్తారో? లేదో? చూడాలి!

Advertisement
 
Advertisement
Advertisement