బిగ్‌బాస్‌ ఫిట్టింగ్‌.. అఖిల్‌, అభి మధ్య మళ్లీ లొల్లి | Bigg Boss 4 Telugu : Akhil Fires On Abhijit | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : వరస్ట్‌ కెప్టెన్‌ ఎవరు?

Nov 27 2020 4:25 PM | Updated on Nov 27 2020 4:35 PM

Bigg Boss 4 Telugu : Akhil Fires On Abhijit - Sakshi

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపు దశకు వచ్చింది. ఈ బిగ్‌ రియాల్టీ షోకి శుభం కార్డు పడటానికి మరో 23 రోజులు మాత్రమే ఉండటంతో మిగిలిన ఎపిసోడ్స్‌ మరింత రసవత్తంగా మార్చేందకు బిగ్‌బాస్‌ నిర్వాహకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొత్త కొత్త టాస్క్‌లు, ఊహించని ట్విస్ట్‌లు ఇస్తూ ప్రతి ఎపిసోడ్‌ని ఆసక్తికరంగా మార్చుతున్నారు. ఇక ఇంటి సభ్యులు కూడా గేమ్‌లో లీనమైపోయారు. విన్నర్‌ అవ్వాలని ప్రతి ఒక్కరు వందశాతం ఫర్మార్మెన్స్‌ ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ హౌస్‌లో‘ రేస్ టు ఫినాలే’ బెల్స్‌ మోగాయి. దీంతో మరోసారి ఇంటి సభ్యుల మధ్య మాట యుద్ధం మొదలైంది. ముఖ్యంగా అభిజిత్‌, అఖిల్‌ల మధ్య లొల్లి మరోసారి తారాస్థాయికి వెళ్లినట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. తాజా ప్రోమో ప్రకారం రేస్ టు ఫినాలే మొదలైందని చెప్పిన బిగ్‌బాస్‌... హౌస్‌లో ఉన్న మాజీ కెప్టెన్స్‌లో ఒక బెస్ట్ కెప్టెన్ ఒక వరస్ట్ కెప్టెన్ ఎన్నుకోవాలని ఆదేశించారు. ఇకేముంది బిగ్‌బాస్‌ పెట్టిన ఫిట్టింగ్‌కి ఇంట్లో మాటల యుద్దమే మొదలైంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న సభ్యుల్లో మోనాల్‌ తప్ప మిగిలిన ఆరుగురు కెప్టెన్‌ అయినవాళ్లే. అయితే వీళ్లలో నేను బెస్ట్ అంటే నేను బెస్ట్ అంటూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో సొహైల్ ఒక అడుగు ముందుకేసి.. నాకైతే అరియానా వరస్ట్ కెప్టెన్ అనిపిస్తుందని ముఖం మీదనే చెప్పేశాడు. దానికి కారణం చెబుతూ..  ఆమె కెప్టెన్సీలో చాలా టార్చర్ అనుభవించానని చెప్పుకొచ్చాడు. అయితే తన కెప్టెన్సీ దగ్గరనుంచి హౌస్‌లో మార్పు అనేది వచ్చిందని.. ఎవరి స్పేస్ వాళ్లకి ఇచ్చానని అరియానా తన కెప్టెన్సీని సమర్థించుకుంది. 
(చదవండి : బిగ్‌బాస్‌ : ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్‌!)

సొహైల్ గాడు సొంతంగా ఆడి కెప్టెన్ అయ్యాడు.. పనిష్మెంట్ స్టార్ట్ చేసింది సొహైల్ మాత్రమే అంటూ తన గురించి తానే గప్పాలు కొట్టుకున్నాడు. అయితే అఖిల్.. అందరూ ఒంటిరిగానే ఆడుతున్నారని కౌంటర్‌ ఇచ్చాడు. ఇక అందరూ కష్టపడి కెప్టెన్ అయితే అఖిల్ మాత్రం లక్‌తో సీక్రెట్ రూంకి వెళ్లి కెప్టెన్ అయ్యాడని అభిజిత్ అనడంతో మళ్లీ లొల్లి మొదలైంది. అఖిల్‌ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. 
(చదవండి : బిగ్‌బాస్‌ : అఖిల్‌పై రాహుల్‌ షాకింగ్‌ కామెంట్స్‌)

అంతకు ముందు నేను చాలా కష్టపడ్డానని, ఇంట్లో నుంచి వెళ్లిపోవడం అనేది బిగ్గెస్ట్ రిస్క్ అని అఖిల్‌ అనగా... ‘అది నీ దృష్టిలో రిస్క్.. మాకు అలా అనిపించలేదు.. నీకు తెలుసు అది రెడ్ జోన్ తిరిగి వస్తానని తెలిసే కావాలనే వెళ్లావు’ అని అభిజిత్ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇద్దరి మధ్య రచ్చ రేగుతుండగా.. సొహైల్ వచ్చి మళ్లీ ఎటో పోతుంది ఇది.. ఆపండి అని అనడంతో.. ఎటు పోతుంద్రా ఆగరా నువ్ అంటూ సొహైల్‌‌పై అఖిల్‌ సీరియస్‌ అయ్యాడు. అసలు అభి, అఖిల్‌ల గొడవ ఏ స్థాయికి వెళ్లింది. అసలు బెస్ట్‌ కెప్టెన్‌, వరస్ట్‌ కెప్టెన్‌గా ఎవరెవరు ఎన్నికయ్యారో తెలియాలంటే మరికొద్ది గంటల్లో ప్రసారమయ్యే నేటి ఎపిసోడ్‌ను చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement