బిగ్‌బాస్‌ : ఈ వారం నో ఎలిమినేషన్‌!

Bigg Boss 4 Telugu : 12th Week  No Elimination - Sakshi

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపుదశకు వచ్చింది. ఊహించని ట్విస్ట్‌లు, కొత్త కొత్త టాస్క్‌లతో గత సీజన్ల కంటే ఎక్కువ వినోదాన్ని అందిస్తూ.. విజయవంతంగా 81 రోజులు పూర్తి చేసుకుంది. 19 మంది హౌస్‌లోకి  ఎంట్రీ ఇవ్వగా.. ప్రస్తుతం ఏడుగురు మిగిలారు. వీరిలో ఈ వారం నామినేషన్‌లో అవినాష్‌, అరియానా, మోనాల్‌, అఖిల్‌ ఉన్నారు. అయితే ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌తో అవినాష్‌ ఈ వారం సేఫ్‌ అయ్యే అవకాశం ఉంది. ఇక మిగిలిన ముగ్గురు అరియానా, మోనాల్‌, అఖిల్‌లలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారా అనేది ఆసక్తిగా మారింది.
(చదవండి : బిగ్‌బాస్‌ : ఆ వీడియోలు వేసి ఇజ్జత్‌ తీయకండి)

ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమేషన్‌ గురించి మరో వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వారం ఎలిమినేషన్‌ ఉండదనేదే ఆ వార్త సారాంశం. ప్రస్తుతం ప్రసారం అవుతున్న నాల్గో సీజన్‌ ముగింపుకు మరో నాలుగు వారాలే మిగిలి ఉన్నాయి. హౌస్‌లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఐదుగురు ఫైనల్‌కు వెళ్తారు. అంటే ఇద్దరు మాత్రమే ఎలిమినేట్‌ కావాలి. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్‌ ఉండకపోవచ్చనేది లీకులవీరుల అంచనా. మరో పక్క ఈ వారం రీఎంట్రీ ఉండనున్నట్లు వార్తలు వచ్చినా.. అది పుకారే అని తేలిపోయింది. బహుశా ఉంటే వచ్చే వారం మధ్యలో ఒకరి రీఎంట్రీ ఉంటుదని లీకుల వీరులు చెప్పేస్తున్నారు. ఇక వచ్చే రెండు వారల్లో ఇద్దరిని ఎలిమినేట్‌ చేసి ఆ తరువాత డిసెంబర్‌ 20న గ్రాండ్ ఫినాలేను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా, టాప్‌ 5లో అభిజిత్‌, సోహైల్‌, అఖిల్‌, అవినాష్‌, మోనాల్‌ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top