రియల్‌ దెయ్యాలతోనే ఆడుకున్నాం: అఖిల్‌

Bigg Boss 4 Telugu : Do Not Play This Video Akhil And Sohail Request To Bigg Boss - Sakshi

బిగ్‌బాస్‌కు అఖిల్‌, సోహైల్‌ విజ్ఞప్తి

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. షో ముగింపునకు మరో 24 రోజులు మాత్రమే ఉండటంతో మిగిలిన ఎపిసోడ్స్‌ని మరింత రసవత్తంగా తిర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు.  ఆస‌క్తిక‌ర‌మైన టాస్క్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ర‌క్తి క‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బుధవారం ఎపిసోడ్‌లో ఇంట్లోకి దెయ్యాన్ని పంపించి హౌస్‌మేట్స్‌ని భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ అంతగా సఫలం కాలేదు. దీంతో ఈ రోజు మరింత డోస్‌ పెంచి ఇంటి సభ్యులకు వణికించే ప్లాన్‌ చేసినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇప్పటి గార్డెన్‌ ఏరియాను శ్మశానంలా మార్చిన బిగ్‌బాస్‌.. కన్ఫెషన్‌ రూమ్‌ని కూడా దెయ్యాల కొంపగా మార్చేశాడు.
(చదవండి : బిగ్‌బాస్‌ : ఆ ఇద్దరికే నా సపోర్ట్‌.. నాగబాబు)

ఇంటి సభ్యులకు హార్రస్‌ సినిమాలు చూపించాడు. ఇక దెయ్యం అంటేనే గజ గజ వణుకుతున్న అరియానాను బిగ్‌బాస్‌ టార్గెట్‌ చేశాడు. దెయ్యం జలజ అరియానాను పిలిచి కన్ఫెషన్‌ రూమ్‌కి పంపింది.  అవినాష్‌తో కలిసి అరియానా కన్ఫెషన్‌ రూమ్‌కి వెళ్లి.. భయంతో పరుగులు పెట్టింది. ఇక అరియానా భయాన్ని హేళన చేస్తూ సోహైల్‌, హారిక స్టెప్పులేశారు. ఇక తర్వాత అఖిల్‌, సోహైల్‌ని కన్ఫెషన్‌ రూమ్‌కి పిలిపించి వాళ్లతో ఓ ఆట ఆడుకుంది దెయ్యం జలజ.  రియల్‌ దెయ్యాలతోనే ఆటలు ఆడుకున్నామని మోనాల్‌ ముందు గప్పాలు కొట్టి లోపలికి వెళ్లి సోహైల్‌, అఖిల్‌.. అక్కడి సౌండ్‌కి భయంతో గజగజ వణికిపోయారు. ఈ ఇద్దరి అరుపులు విని మిగతా ఇంటి సభ్యులు కడుపుబ్బా నవ్వారు. ఇక బయటకు వచ్చిన అఖి, సోహైల్‌ బిగ్‌బాస్‌ కెమెరా ముందుకు వెళ్లి ఈ వీడియోను ప్లే చేయకండని వేడుకున్నారు. ‘గజ్జుమనిపించిడ్రు. బై మిస్టేక్‌ కూడా ఈ వీడియోలు ఎక్కడా వేయకండి. మా ఇజ్జత్‌ పోతది. చూడడానికి కండలు తిరిగి ఉన్నాం. కానీ భయంతో వణికిపోయాం’ అంటూ కెమెరా ముందకు వచ్చి బిగ్‌బాస్‌కు రిక్వెస్ట్‌ చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top