Bhagyashree Gets Emotional Remembering Her Wedding, Details Inside In Telugu - Sakshi
Sakshi News home page

Bhagyashree: తన పెళ్లి గురించి చెబుతూ ఏడ్చేసిన టాప్​ హీరోయిన్..​

Mar 1 2022 8:24 PM | Updated on Mar 2 2022 11:40 AM

Bhagyashree Gets Emotional Remembering Her Wedding - Sakshi

Bhagyashree Gets Emotional Remembering Her Wedding: బాలీవుడ్​లో ఒక ఊపు ఊపేసిన అలనాటి టాప్​ హీరోయిన్​ భాగ్యశ్రీ. 1989లో సల్మాన్​ ఖాన్​ సరసన 'మైనే ప్యార్​ కియా' సినిమాతో ఎంత క్రేజ్​ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్​గా ప్రత్యేక గుర్తింపు పొందిన భాగ్యశ్రీ పలు సామాజిక సేవలందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 'భాగ్యశ్రీ' స్కీమ్​కు 2015లో బ్రాండ్​ అంబాసిడర్​గా కూడా ఎంపికైంది. ఇటీవల స్టార్​ప్లస్​ నిర్వహిస్తున్న కొత్త రియాలిటీ షో 'స్మార్ట్​ జోడి'లో భాగ్యశ్రీ దంపతులు పాల్గొన్నారు. ఈ షోలో తన వివాహం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైంది. 

హిమాలయ దస్సానితో తన వివాహానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదని, ఎలాంటి మద్దతు ఇవ్వలేదని ఎమోషనల్​ అయింది భాగ్యశ్రీ. వారి పెళ్లికి తన భర్త తప్ప ఇంకెవరూ లేరని కన్నీళ్లు పెట్టుకుంది. 'తల్లిదండ్రులు తమ పిల్లల గురించి కలలు కంటారు. కానీ తమ పిల్లలకు కూడా సొంత కలలు ఉంటాయి. మీరు వారి కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించాలి. కొన్నిసార్లు వారి డ్రీమ్స్​తో వారిని జీవించనివ్వండి. ఎందుకంటే చివరికీ వారి జీవితాన్ని వారే జీవించాలి కాబట్టి.' అని చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ.

అలాగే 'ఒక సమయంలో నేను, హిమాలయ దస్సానీ లేచిపోయామని ప్రజలు, మీడియా ప్రచారం చేశారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే మేము అలా చేయలేదు.' అని పేర్కొంది. స్టార్​ ప్లస్​ నిర్వహిస్తున్న ఈ స్మార్ట్ జోడీ రియాలిటీ షోలో నిజ జీవితంలోని 10 మంది జంటలు పాల్గొంటారు. అందులో భాగంగా ఒక జంటగా భాగ్యశ్రీ-హిమాలయ దస్సానీ పార్టిసిపేట్​ చేశారు. 
 

   
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement