కూతురి పెళ్లి.. డ్యాన్స్ ఇరగదీసిన డైరెక్టర్ మురగదాస్ | AR Murugadoss Daughter Wedding Dance | Sakshi
Sakshi News home page

AR Murugadoss: కుమార్తె హల్దీ వేడుకల్లో స్టార్ డైరెక్టర్ డ్యాన్స్

Jun 16 2025 5:56 PM | Updated on Jun 16 2025 6:28 PM

AR Murugadoss Daughter Wedding Dance

స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్వతహాగా తమిళుడు అయినప్పటికీ.. గజిని, తుపాకీ తదితర సినిమాలతో టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత చిరంజీవితో 'స్టాలిన్', మహేశ్ బాబుతో 'స్పైడర్' సినిమాలు కూడా తీసి ఆకట్టుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత ఈ ఏడాది 'సికిందర్' మూవీతో వచ్చారు గానీ ఘోరమైన ఫ్లాప్‌గా నిలిచింది. ప్రస్తుతం తమిళ హీరో శివకార్తికేయన్‌తో 'మదరాసి' మూవీ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'కన్నప్ప' చూసిన రజినీకాంత్.. విష్ణుతో ఏం చెప్పారంటే?)

మురుగదాస్ ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి సోమవారం జరిగింది. అయితే ఇది మురుగదాస్ కూతురు దివ్య హల్దీ వేడుక అని అంటున్నారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. సరే అసలు విషయానికొస్తే.. ఈ వేడుకలో మురుగదాస్ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. కూతురు, కొడుకుతో కలిసి రీసెంట్ ట్రెండీ సాంగ్ 'కనిమా' పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

2005లో మురుగదాస్‪‌కి పెళ్లి కాగా.. కొన్నాళ్లకు కొడుకు-కూతురు పుట్టారు. ప్రస్తుతం కూతురు పెళ్లి వేడుకకు ముందు జరిగే హల్దీ అంటున్నారు. మరికొందరు మాత్రం కూతురు రజస్వల వేడుక అని అంటున్నారు. ఏదేమైనా ఎప్పుడు సైలెంట్‌గా ఉండే మురుగదాస్ మాత్రం కూతురు, కొడుకుతో కలిసి డ్యాన్స్ మాత్రం ఇరగదీశారని చెప్పొచ్చు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేసేయండి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement