ముంబైకి అల్లు అర్జున్… పుకార్ల వెనుక నిజం | Allu Arjun in Mumbai, but he was not settling there permanently | Sakshi
Sakshi News home page

ముంబైకి అల్లు అర్జున్… పుకార్ల వెనుక నిజం

Apr 21 2026 11:59 PM | Updated on Apr 22 2026 12:23 AM

Allu Arjun in Mumbai, but he was not settling there permanently

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ముంబయిలో సెటిల్ అవుతున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయంపై గత రెండు రోజులుగా వరుస కథనాలు వచ్చాయి. దీనికి కారణం, బన్నీ నిజంగానే ముంబయికి షిఫ్ట్ అవ్వడమే. కానీ ఇందులో సగం మాత్రమే నిజం అని తాజా సమాచారం.  

అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం బన్నీ తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న ‘రాకా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రధాన షూటింగ్ మొత్తం ముంబయిలోని ఓ స్టూడియోలో జరుగుతోంది. కీలకమైన ఈ షెడ్యూల్ కారణంగా హైదరాబాద్‌, ముంబయి మధ్య ప్రయాణం కష్టంగా ఉండటంతో, తాత్కాలికంగా ముంబయిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.  

ఇక ఇదే సమయంలో బన్నీ ముంబయిలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడని, అక్కడే శాశ్వతంగా సెటిల్ అవ్వబోతున్నాడని పుకార్లు చెలరేగాయి. కానీ నిజానికి  బన్నీ ముంబయిలో ఫ్లాట్ కొనలేదు. కేవలం కొన్ని రోజుల పాటు ఉండటానికి లీజు కింద తీసుకున్నాడని సమాచారం. ఈ విషయాన్ని బన్నీ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ కూడా స్పష్టం చేశారు. ‘రాకా’ షూటింగ్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ తిరిగి హైదరాబాద్‌కి వస్తాడు.  

ఇక బన్నీ, అట్లీతో 'రాకా' సినిమా తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అనిరుధ్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా 'కేజీఎఫ్‌' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కూడా ఒక సినిమా చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బన్నీ ముంబయిలో ఉన్నది నిజమే కానీ అక్కడే శాశ్వతంగా సెటిల్ మాత్రం అవ్వడం లేదు.  

Advertisement
 
Advertisement
Advertisement