
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఏఏ22 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే ముంబయిలో షూటింగ్ పూర్తి చేసుకుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సరికొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు వెల్లడించారు. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించనున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ప్రస్తుతం ఈ సినిమాకు షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఐకాన్ స్టార్ వెకేషన్‌లో చిల్ అవుతున్నారు. తన సతీమణి స్నేహరెడ్డితో కలిసి విదేశాల్లో చిల్ అవుతున్నారు. తాజాగా ఈ ఫోటోలను బన్నీ భార్య సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.