నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ | Sakshi
Sakshi News home page

అవార్డ్ విన్నింగ్ హీరోయిన్.. ఇన్నాళ్లకు ప్రియుడితో ఒక్కటైంది!

Published Mon, Jan 29 2024 2:50 PM

Actress Shraddha Dangar Married Actor Akash Pandya - Sakshi

మరో ప్రముఖ హీరోయిన్ పెళ్లి చేసుకుంది. నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్ల తర్వాత వివాహం జరగడం ఇక్కడ ట్విస్ట్. ఓ అవార్డ్ విన్నింగ్ సినిమాతో చాలా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. గతేడాది తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె పెళ్లి విషయం తెలిసి అందరూ ఈమెని అభినందిస్తున్నారు. అలానే ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరీ బ్యూటీ? ఏంటా పెళ్లి కహానీ?

(ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్)

గుజరాతీ నటి శ్రద్ధా దంగర్.. 2017లో 'పప్పా తమ్నే నహీ సమ్జే' అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తూ వచ్చింది. 2018లో మాత్రం ఈమె యాక్ట్ చేసిన 'హెల్లరో' అనే చిత్రానికి గానూ ఈమెకు అవార్డు వచ్చింది. అలా మిగతా భాషా ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమైంది. కేవలం గుజరాతీ భాషలోనే మూవీస్ చేస్తూ వస్తున్న ఈమె.. గతేడాది తెలుగులో వచ్చిన 'మ్యాన్షన్ 24' అనే వెబ్ సిరీస్‌లో రజియా అనే పాత్రలో కనిపించింది.

పెళ్లి విషయానికొస్తే శ్రద్ధా దంగర్‍.. 2020 జనవరిలో నటుడు ఆకాశ్ పాండ్యతో నిశ్చితార్థం చేసుకుంది. ఏమైందో ఏమో గానీ వీళ్ల పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు సరిగ్గా జనవరి చివరలోనే వివాహంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం శ్రద్ధా-ఆకాశ్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement