రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక.. తెలుగులో ఈమెనే టాప్? | Actress Rashmika Mandanna Hikes Fee After Animal Success? - Sakshi
Sakshi News home page

Rashmika: టాప్ లేపుతున్న రష్మిక.. పారితోషికం అంత డిమాండ్ చేస్తోందా?

Feb 6 2024 2:43 PM | Updated on Feb 6 2024 3:10 PM

Actress Rashmika Mandanna Remuneration Details Latest - Sakshi

ప్రస్తుతం తెలుగులో వన్ ఆఫ్ ది ట్రెండింగ్ హీరోయిన్ రష్మిక. మంచో చెడో పక్కనబెడితే ఈమె గురించి జనాలు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఫన్నీ ట్రోల్స్ లాంటివి కూడా చేస్తుంటారు. మొన్నీ మధ్య ఈమె పెళ్లి గురించి వార్తలు రాగా అవి కేవలం రూమర్లే అని తేలిపోయాయి. ఇప్పుడు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ గురించి ఓ విషయం బయటపడింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయిపోయింది.

కన్నడ బ్యూటీ రష్మిక.. 'ఛలో' మూవీతో తెలుగులోకి ఎం‍ట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మిడ్ రేంజ్ హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్ 'పుష్ప' రిలీజ్ తర్వాత మాత్రం ఈమెకు పాన్ ఇండియా లెవల్లో ఫేమ్ వచ్చింది. ఈ క్రమంలోనే దక్షిణాదితోపాటు హిందీలోనూ నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.

(ఇదీ చదవండి: అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన)

రష్మిక ప్రస్తుతం తెలుగులో 'పుష్ప 2'తో పాటు 'గర్ల్ ఫ్రెండ్' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తోంది. అయితే వీటిలో చేస్తున్నందుకు గానూ రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోందని సమాచారం. కానీ కొత్తగా అంగీకరించిన ఓ మూవీ కోసం మాత్రం రూ.4 కోట్ల వరకు డిమాండ్ చేసిందట. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది.

ఎందుకంటే ఇప్పటివరకు సమంత, అనుష్క, పూజాహెగ్డే తదితరులు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ వరకు వచ్చారు కానీ అంతకు మించి వెళ్లలేకపోయారు. కానీ రష్మిక మాత్రం అటు సినిమాలు, ఇటు రెమ్యునరేషన్ విషయంలో జోరు చూపిస్తోంది. మరో రెండు మూడు హిట్లు పడితే రష్మిక పారితోషికం ఇంకా పెరిగే ఛాన్స్ ఉందేమోనని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?)

Advertisement
 
Advertisement
Advertisement