
ప్రముఖ బాలీవుడ్ మాళవిక రాజ్ అభిమానులకు శుభవార్త చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ఇద్దరం ఉన్న మేము ఇప్పుడు ముగ్గురం అయ్యామంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.
కాగా.. బాలీవుడ్‌లో 'కభీ ఖుషీ కభీ ఘమ్' చిత్రంలో పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. మాల్వికా రాజ్ రింజిన్ డెంజోంగ్పాతో కలిసి 'స్క్వాడ్' అనే యాక్షన్ చిత్రంలో కూడా నటించింది. కాగా.. 2023లో ప్రణవ్ బగ్గాతో ప్రేమలో పడింది మాల్వికా రాజ్. కొన్ని డేటింగ్ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. బీచ్‌లో జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుకలో పలువురు సినీతారలు హాజరయ్యారు.