నిరాహార దీక్ష చేసి మరీ ఇండస్ట్రీలో అడుగుపెట్టా: బుల్లితెర నటి | Actress Asha Negi Went Hunger Strike to Convince Parents for Acting Dreams | Sakshi
Sakshi News home page

సినిమాల్లోకి రావాలనుకుని టీవీలో సెటిలయ్యా,.. అనుకున్నంత ఈజీ కాదు!

Sep 30 2024 6:58 PM | Updated on Sep 30 2024 7:48 PM

Actress Asha Negi Went Hunger Strike to Convince Parents for Acting Dreams

రంగులప్రపంచంలో భాగం కావాలని కలలుకనేవాళ్లు ఎంతోమంది. బుల్లితెర నటి ఆశా నేగి కూడా అలానే కలలు కంది. అందరు తల్లిదండ్రులలాగే ఆమె పేరెంట్స్‌ కూడా అందుకు ఒప్పుకోలేదు. కొద్దిరోజులైతే తనే ఆ కలను మర్చిపోతుందనుకున్నారు. కానీ ఆమె పట్టు వదల్లేదు, నిరాహార దీక్ష చేపట్టింది. రెండుమూడురోజులపాటు తిండి తినకుండా మొండిగా కూర్చుంది. దీంతో ఆమె తల్లి తనను సముదాయించే ప్రయత్నం చేసింది. 

మొదటి ప్రాధాన్యత సినిమాకు..
నాకు మూడు నెలల గడువు ఇవ్వు. అప్పటిలోపు నన్ను నేను నిరూపించుకోకపోతే తిరిగొచ్చి మీకు నచ్చిందే చేస్తాను అని తల్లిని బతిమాలింది. అలా ఆశా నేగి తన కుటుంబాన్ని ఒప్పించి డెహ్రాడూన్‌ వదిలేసి ముంబైకి వచ్చేసింది. తన టాలెంట్‌తో పాపులర్‌ అయింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ముంబై వచ్చిన కొత్తలో నాకేం అర్థం కాలేదు. సినిమాలు చేద్దామనుకున్నాను. టీవీ వైపు వెళ్లాలనుకోలేదు.

ఆడిషన్స్‌ ఇస్తూ పోయా
అయినా ఇక్కడ ఏదీ అంత ఈజీగా రాదని తెలుసుకున్నాను. ఆడిషన్స్‌ ఇస్తూ పోయాను. అలా ఓ సీరియల్‌లో ఛాన్స్‌ వచ్చింది. టీవీ ఇండస్ట్రీ నన్ను అక్కున చేర్చుకుంది. నాకెంతో ప్రేమను ఇచ్చింది అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఆశా నేగి చివరగా హనీమూన్‌ ఫోటోగ్రాఫర్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇది జియో సినిమాలో స్ట్రీమ్‌ అవుతోంది.

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement