నన్ను చూసి అబ్బాయిలు కన్నుకొడుతూనే ఉంటారు: నరేశ్ | Sakshi
Sakshi News home page

Naaresh VK: ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటుడు నరేశ్

Published Sat, Feb 24 2024 7:42 PM

Actor Naresh Speech Bhimaa Trailer Launch Event  - Sakshi

సీనియర్ నటుడు నరేశ్ ఎంత మంచి యాక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వ్యక్తిగత జీవితం ఏంటనేది పక్కనబెడితే యాక్టింగ్ పరంగా ప్రతి సినిమాతోనూ మెస్మరైజ్ చేస్తుంటాడు. ఇకపోతే గత కొన్నాళ్ల నుంచి బయట పెద్దగా కనిపించని ఈయన.. తాజాగా 'భీమా' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఫుల్ జోష్‌తో మాట్లాడాడు. అలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేయడం విశేషం.

(ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలతో హీరోయిన్ ప్రగ్యా.. తమన్నాని చూస్తే తట్టుకోవడం కష్టమే!)

దివంగత హీరోయిన్, దర్శకురాలు విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేశ్.. హీరోగా పలు సినిమాలు చేశాడు. కానీ నిలదొక్కుకోలేకపోయాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. అ‍ప్పటి నుంచి ఇప్పటివరకు వందలాది చిత్రాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు ప్రతి ఒక్కరితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.

శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలోకి రాబోతున్న గోపీచంద్ 'భీమా' సినిమాలోనూ నరేశ్ మంచి పాత్రే చేసినట్లు ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ఇందులో ఫుల్ జోష్‌తో స్పీచ్ ఇచ్చాడు. ఈ సినిమా చూసిన తర్వాత తనని చూసి అందరూ (అబ్బాయిలని ఉద్దేశించి) కన్నుకొడతారని నవ్వుతూ చెప్పాడు. అయితే సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేశాడనేది కొన్నిరోజులు ఆగితే తెలిసిపోతుంది.

(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?)

Advertisement
Advertisement