వెళుతూ ఉండాలి... వెళ్లనివ్వాలి

Actor Amala Paul Tallking About 2020 - Sakshi

‘‘జీవితం ఏది ఇస్తే దాన్ని అంగీకరించాలి’’ అంటున్నారు అమలా పాల్‌. ఇంకా చాలా విషయాలు చెప్పారు. 2020 చాలా నేర్పించిందంటున్నారామె. ఈ ఏడాది నేర్చుకున్న విషయాలు, తీసుకున్న నిర్ణయాల గురించి అమలా పాల్‌ ఈ విధంగా చెప్పారు.


సరిగ్గా లేకపోవడం సరైనదేనని నేర్చుకున్నాను. నువ్వు సరిగ్గా లేవనే సంగతిని స్వీకరించకపోవడం సరైనది కాదని తెలుసుకున్నాను. సరేనా? మన లోపాల్ని స్వీకరించడంతోనే ఉపశమనం మొదలవుతుంది.

.
దైవత్వంతో పున స్సంధానమై, నా అహం తాలూకు మరణం నుంచి మేలుకొన్నాను. నాలోని కుండలిని (అనిర్వచనీయమైన శక్తి)ని నన్ను జాగృతం చేయనిచ్చాను.


జీవితం నా దారిలో విసిరేసిన ప్రతి దానినీ హుందాగా, కృతజ్ఞతగా స్వీకరించాను.


బాధ నుంచి నేనెప్పుడూ తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ బాధను నన్ను ప్రభావితం చేయనిచ్చాను. బాధను అనుభవించడం నుంచే చాలా నేర్చుకున్నా.


పాత స్నేహితులను కలవడానికి వెళ్లాలి. జీవితంలో కొత్త జ్ఞాపకాల కోసం వెళ్లాలి. శత్రువులను క్షమించడానికి వెళ్లాలి. మన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తికి ధన్యవాదాలు చెప్పడానికి వెళ్లాలి. మనల్ని మనం తెలుసుకోవడానికి వెళ్లాలి. వెళ్లాలి.. వెళ్లాలి.. వెళుతూ ఉండాలి. వెళ్లనివ్వాలి.


నా జీవనగడియారాన్ని సరిదిద్దుకోవడానికి నేను ఆయుర్వేదాన్ని ఆశ్రయించాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top