హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్‌ | Actor Allu Arjun appeal to Delhi high court for his privacy | Sakshi
Sakshi News home page

హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్‌

Apr 17 2026 10:24 AM | Updated on Apr 17 2026 10:33 AM

Actor Allu Arjun appeal to Delhi high court for his privacy

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.  అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటో, వాయిస్‌లను ఎవరూ వాడకూడదని కోరుతూ ఒక పిటీషన్‌ దాఖలు చేశారు. తన పేరు, ఫోటోలను ఉపయోగించుకుని పలు ఉత్పత్తులను విక్రయిస్తూ డబ్బు సంపాదించుకుంటూ తన ప్రతిష్ణను దెబ్బతీసేలా చేస్తున్న వారికి ఈ కేసు వర్తిస్తుంది. తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో అల్లు అర్జున్ దావా వేశారు. నేడు జస్టిస్ తుషార్ రావు కమిటీ నేతృత్వంలో విచారణకు రానుంది.

ఇదే అంశంలో ఇప్పటికే చిరంజీవి , మోహన్ లాల్ , నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, పవన్‌ కల్యాణ్‌, ఐశ్వర్య రాయ్‌ తదితరులు తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ కోర్టును కోరిన విషయం తెలిసిందే. ఈ కేసులలో సినీ ప్రముఖల ప్రైవసీ హక్కులను రక్షించకపోతే వారికి సరిదిద్దలేని నష్టం జరుగుతుందని న్యాయస్థానం స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement