Chiranjeevi: టాలీవుడ్‌లో బెస్ట్‌ డ్యాన్సర్స్‌ వాళ్లే: చిరంజీవి

According To Chiranjeevi Who Are The Best Dancers - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తాజాగా నటించిన చిత్రం ‘ఆచార్య’. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక పలు వాయిదాల అనంతరం ఈ చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ను స్పీడ్‌గా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే చిరంజీవి, కొరటాల శివ, రామ్‌ చరణ్‌తో చిట్‌చాట్ నిర్వహించాడు డైరెక్టర్‌ హరీశ్ శంకర్‌. ఈ చిట్‌చాట్‌లో హరీశ్ శంకర్‌ పలు ప్రశ్నలు ఉడగ్గా.. చిరంజీవి ఆసక్తికర సమాధానలు చెప్పారు. 

చిరంజీవిని డ్యాన్స్‌కు సంబంధించిన ప్రశ్న అడిగాడు హరీశ్‌ శంకర్. 'మీరిద్దరు (చిరంజీవి, రామ్ చరణ్‌) కాకుండా టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో బెస్ట్‌ డ్యాన్సర్స్‌ ఎవరని అనుకుంటున్నారు' అని చిరంజీవిని అడిగాడు హరీశ్‌ శంకర్‌. ఇందుకు 'చాలా మంది డ్యాన్సర్స్‌ ఉన్నారు. ముఖ్యంగా బన్నీ, తారక్‌, రామ్‌, నితిన్‌ చాలా బాగా డ్యాన్స్‌ చేస్తున్నారు' అని చిరంజీవి చెప్పగా రామ్‌ చరణ్‌ మధ్యలో కల్పించుకుని 'నా దృష్టిలో తారక్‌, బన్నీ బెస్ట్‌ డ్యాన్సర్స్‌' అని తెలిపాడు. ఇకపోతే 'ఆచార్య' మూవీలో 'బంజారా' పాటకు చిరంజీవి, రామ్ చరణ్‌ కలిసి డ్యాన్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. 

చదవండి'సినిమా ఆడకపోతే ఏ సమస్య లేదు.. ఆడితేనే సమస్య'
బిగ్‌ సర్‌ప్రైజ్‌, ఆచార‍్యలో అనుష్క స్పెషల్‌ రోల్‌!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top