తెలుగులోకి మరో క్రేజీ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | 1000 Babies Movie OTT Trailer And Streaming Date | Sakshi
Sakshi News home page

1000 Babies OTT: ఇంట్రెస్టింగ్ ట్రైలర్.. సిరీస్ రిలీజ్ ఫిక్స్

Oct 7 2024 5:25 PM | Updated on Oct 7 2024 6:29 PM

1000 Babies Movie OTT Trailer And Streaming Date

థియేటర్లలో సినిమాలు వచ్చినట్లే.. ఓటీటీలో కొత్త కొత్త వెబ్ సిరీసులు కూడా ఎప్పటికప్పుడు స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. తెలుగులో స్ట్రెయిట్‌గా తీయనప్పటికీ.. ఇతర భాషల్లో తీసిన సిరీస్‌లని డబ్ చేసి మరీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలా ఇప్పుడు ఓ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.

(ఇదీ చదవండి: చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?)

'1000 బేబీస్' పేరుతో తీసిన ఈ సిరీస్‌ని సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఓ పోలీస్ టీమ్ దేనికోసమే సెర్చ్ చేస్తున్నారు. మరోవైపు అడవి మధ్యలో ఓ ఇంట్లో ముసలావిడ. ట్రైలర్‌లో పెద్దగా కథని రివీల్ చేయలేదు గానీ చూస్తుంటే ఇదేదో మంచి థ్రిల్లర్‌లా అనిపిస్తుంది.

మలయాళంలో తీసినప్పటికీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ డబ్ చేసి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అక్టోబరు 18న అంటే వచ్చే శుక్రవారం ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. మీరు ట్రైలర్‌పై ఓ లుక్కేసేయండి.

(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!)

Advertisement
 
Advertisement
Advertisement