
పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు
నర్సాపూర్/కౌడిపల్లి(నర్సాపూర్): పార్టీ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఏఐసీసీ పరీశీలకురాలు జ్యోతి రౌతేలా అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో డీసీసీ అధ్యక్ష పదవి కోసం నర్సాపూర్, శివ్వంపేట మండలాలకు చెందిన పార్టీ నాయకుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతి థిగా ఆమె హాజరై మాట్లాడారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అగ్రనేత రాహుల్‌గాంధీ పలు కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. పార్టీ పదవుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, మైనార్టీ వర్గాల కార్యకర్తలు పోటీ పడవచ్చన్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించి పార్టీ పదవుల భర్తీ సమయంలో తగిన ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ అ బ్జర్వర్లు నసీర్ అహ్మద్, జగదీశ్వర్, వరలక్ష్మి, డీసీసీ అద్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. అనంతరం కౌడిపల్లి మండలం తిమ్మాపూర్‌లో కౌడిపల్లి, కొల్చారం, వెల్దుర్తి, మాసాయిపేట, చిలప్‌చెడ్ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ నిర్వహించారు. 18న ఏఐసీసీ కార్యాలయానికి దర ఖాస్తుల జాబితా పంపుతామని చెప్పారు.
ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రౌతేలా