అప్పులు తీర్చేందుకే రెండేళ్లు | - | Sakshi
Sakshi News home page

అప్పులు తీర్చేందుకే రెండేళ్లు

Oct 15 2025 8:00 AM | Updated on Oct 15 2025 8:00 AM

అప్పు

అప్పులు తీర్చేందుకే రెండేళ్లు

అప్పులు తీర్చేందుకే రెండేళ్లు కమలను హత్య చేసిన వారిని శిక్షించాలి బాధితులందరికీ న్యాయం చేయాలి హక్కులు సంపూర్ణంగా పొందాలి

మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు

నిజాంపేట(మెదక్‌): గత ప్రభుత్వంలో చేసిన అప్పులు తీర్చడంతోనే రెండేళ్ల పాలన సరిపోయిందని మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే హనుమ ంతరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రాంపూర్‌ గ్రామంలో లీలా గ్రూప్‌ చైర్మన్‌, కాంగ్రెస్‌ నాయకుడు డా.మోహన్‌ నాయక్‌ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులు చేసినా ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. వచ్చే మూడేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. అనంతరం మహిళలు గ్రామానికి బస్సులు నడపాలని విజ్ఞప్తి చేయడంతో డిపో మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, మహేందర్‌, సత్యనారాయణ, వెంకట్‌గౌడ్‌ పాల్గొన్నారు.

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మెదక్‌ మండలం సంగాయిగూడతండాకు చెందిన కమలను హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆమె డీఎస్పీ ప్రసన్నకుమార్‌, మెదక్‌రూరల్‌ సీఐ జార్జ్‌కు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం కమల నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహిళలపై జరుగుతున్న హత్యలపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్ర మహిళా మంత్రి కొండా సురేఖ, సీతక్క ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆమె వెంట జాగృతి జిల్లా నాయకుడు వీరప్ప గారి రమేశ్‌గౌడ్‌, రాజేశ్వరి తదితరులు ఉన్నారు.

టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ప్రణీద్‌ కుమార్‌

నిజాంపేట(మెదక్‌): 317 జీఓ కారణంగా స్థానిక జిల్లాను కోల్పోయిన ఉపాధ్యాయులందరికీ శాశ్వతంగా వారి సొంత జిల్లాలకు కేటాయించేలా చూడాలని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ప్రణీద్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టీపీటీఎఫ్‌ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిజాంపేట మండలంలోని పలు ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బైతి ఐలయ్య మాట్లాడుతూ.. తాత్కాలిక డిప్యుటేషన్‌ కోసం ఇచ్చిన జీఓ 190 సీనియర్‌ ఉపాధ్యాయులకు అన్యాయం చేసే లా ఉందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నవీన్‌ రత్నాకర్‌, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్‌, జిల్లా బాధ్యులు మోహన్‌, పరమేశ్వర్‌, శ్రీకాంత్‌రెడ్డి, వినయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

నర్సాపూర్‌: రాజ్యాంగం ద్వారా సంక్రమించే హక్కులను బాలికలు సంపూర్ణంగా పొందాలని ఇన్‌చార్జి డీడబ్ల్యూఓ హేమ భార్గవి పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల లీగల్‌ సర్వీస్‌ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశంలో బాలికల రక్షణ కోసం రాజ్యాంగంలో పలు చట్టాలు ఉన్నాయని, ఆయా చట్టాలను బాలికలు తమ రక్షణకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోకిరిల నుంచి రక్షణ పొందడానికి 100 కు ఫోన్‌ చేసి సహాయం పొందాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, కోర్టు ఏజీపీ సుధాకర్‌, ఎంఈఓ తారాసింగ్‌, లీగల్‌ సర్వీస్‌ కమిటీ న్యాయవాదులు మధుశ్రీ, రాజునాయక్‌, సాయికుమార్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు సంతోష, జెండర్‌ కోఆర్డినేటర్‌ కవిత పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అప్పులు తీర్చేందుకే రెండేళ్లు 
1
1/3

అప్పులు తీర్చేందుకే రెండేళ్లు

అప్పులు తీర్చేందుకే రెండేళ్లు 
2
2/3

అప్పులు తీర్చేందుకే రెండేళ్లు

అప్పులు తీర్చేందుకే రెండేళ్లు 
3
3/3

అప్పులు తీర్చేందుకే రెండేళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement