
తాగునీటి కోసం తండ్లాట
మండల పరిధిలోని కామారం తండా వాసులు తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో వ్యవసాయ బోరుమోటార్లను ఆశ్రయించాల్సి వస్తుంది. తాగునీరు సరిగా సరఫరా కావడం లేదని, ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలని ఎన్నిసార్లు కోరినా గ్రామపంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని మహిళలు విమర్శించారు. వరి కోతలు మొదలైతే వ్యవసాయ రైతులు కూడా బోరుమోటార్లు బంద్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు తాగు నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. – చిన్నశంకరంపేట(మెదక్)