
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
మెదక్ మున్సిపాలిటీ: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా శనివారం పట్టణంలోని 23, 31వ వార్డులో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పర్యటించారు. ఈసందర్భంగా ఇంటింటికీ తిరిగి తడి, పొడి, హానికరమైన చెత్తను వేరుచేసి మున్సిపల్ వాహనాలకు ఇవ్వాలని సూచించారు. అలాగే దోమలు వ్యాప్తి చెందకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. అనంతరం ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను తీర్చాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ వెంకటేశ్, వార్డు అధికారులు, శానిటరీ జవాన్లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేశ్