
విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలి
పాపన్నపేట(మెదక్): ప్రతి విద్యార్థికి కనీస అభ్యసన సామర్థ్యాలు రావాలని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. శనివారం ఆయన కుర్తివాడలో జరిగిన యూపీ స్థాయి గణితం కాంప్లెక్స్ సమావేశాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి స్థాయికి తగ్గ సామర్థ్యాలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత టీచర్లదేనన్నారు. చతుర్విద ప్రక్రియలపై దృష్టి సారించాలని కోరారు. నిత్య జీవితంలో లెక్కలు ముఖ్యమైనందున, గణితంపై పట్టు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. టీచర్లు సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం అమల్లోకి వచ్చినందున, ప్రతి ఒక్కరూ దానిని పాటించాలన్నారు. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో టేక్మాల్, పాపన్నపేట మండలాల టీచర్లు, కాంప్లెక్స్ హెచ్‌ఎం శ్రీనివాస్‌రావు, సీఆర్పీ దేవయ్య పాల్గొన్నారు.
డీఈఓ రాధాకిషన్