ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి

Aug 3 2025 8:48 AM | Updated on Aug 3 2025 9:02 AM

ఇళ్ల

ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

రామాయంపేట(మెదక్‌): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శనివారం మండలంలోని దంతేపల్లి, కిషన్‌ తండాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణ పనులు ఆలస్యం చేయవద్దని, త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. బిల్లులు కూడా వెంట వెంటనే మంజూరవుతున్నాయని, నేరు గా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్లు చెప్పారు. అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటించారు. కుండీలలో నిల్వ ఉన్న నీటిని పరిశీలించి వెంటనే నీటిని తొలగించాలన్నారు. నీటిని నిల్వ ఉంచితే దోమల సంఖ్య పెరుగుతుందని వివరించారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీఓ సజీవొద్దీన్‌, ఇతర అధికారులు ఉన్నారు.

ఎఎల్‌ఎం పోస్టులుమంజూరు చేయాలి

పాపన్నపేట(మెదక్‌): జిల్లాకు 51 అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ పోస్టులు మంజూరు చేయాలని ఆర్థిక, విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు శనివారం మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 200 గ్రామాలకు సరిపడా ఎఎల్‌ఎంలు లేక విద్యుత్‌ సేవలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఈ మేరకు పాపన్నపేట మండలానికి 15, మెదక్‌ పట్టణానికి 5, ఘనపూర్‌ 6, మెదక్‌ 6, రామాయంపేట 5, చిన్నశంకరంపేట 7, నిజాంపేట మండలానికి 7 పోస్టులు మంజూరు చేయాలని కోరారు.

‘విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు’

రామాయంపేట(మెదక్‌): సీజనల్‌ వ్యాధులపై ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్‌ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండలంలోని ప్రగతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. విధిగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించాలన్నారు. అంతకుముందు రిజిస్టర్‌ను తనిఖీ చేసి ఫార్మసీ, ల్యాబ్‌ వార్డులను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట ఆస్పత్రి వైద్యురాలు హరిప్రియతో పాటు ఏఎన్‌ఎంలు, నర్సులు ఉన్నారు.

మరో భవనంలోకి మార్చండి

అల్లాదుర్గం(మెదక్‌): మండల పరిధిలోని చిల్వెర అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా మహి ళా, శిశు సంక్షేమశాఖ అధికారిణి హైమావతి శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా అంగన్‌వాడీ భవ నం పెచ్చులూడి శిథిలావస్థకు చేరిందని, మరో భవనంలోకి మార్చాలని అదేశించారు. కేంద్రం ఆపరిశుభ్రంగా ఉండటంపై టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు.

లోక్‌ అదాలత్‌ను

విజయవంతం చేయాలి

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని పోలీస్‌, ఎకై ్సజ్‌ శాఖలు సమన్వయంతో పనిచేసి సెప్టెంబర్‌ 13న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఆర్‌ఎం సుభవల్లి అన్నారు. శనివారం జిల్లా పోలీస్‌, ఎకై ్సజ్‌ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి 1
1/1

ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement