
సైబర్ వలలో విద్యావంతులే అధికం
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: సైబర్ నేరగాళ్ల వలలో విద్యావంతులే అధికంగా ఉంటున్నారని, ఉచితం, ఎక్కువ లాభం అంటే మోసం అని గ్రహించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు. ఆశ, భయం, మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. బ్యాంకు అధికారులమని ఫోన్ చేస్తే నమ్మవద్దని, అనుమానం ఉంటే సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించాలని సూచించారు.
16 ఫిర్యాదులు
జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ జిల్లాస్థాయి ప్రజావాణి నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు 16 సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు.