
కాంగ్రెస్‌తోనే పేదల సంక్షేమం
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్/కంగ్టి/కల్హేర్: పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పేదలకు రేషన్ కార్డులు, ఇళ్లు ఇవ్వలేదని, పేదల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. కంగ్టిలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇన్నాళ్లు రేషన్ కార్డులు లేక పేదలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బేస్‌మెంట్ పూర్తిచేసిన వారికి చెక్కులు పంపిణీ చేశారు. అలాగే కల్హేర్ మండలం సిర్గాపూర్‌లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. మండలంలోని కృష్ణాపూర్ వద్ద నల్లవాగు కాల్వలో పూడిక తీత, చెట్ల పొదల తొలగింపు పనులను పరిశీలించారు. నల్లవాగు ప్రాజెక్టు నిండితే కాల్వల ద్వారా సాగు నీటి సరఫరాకు ఆటంకం లేకుండా పూడిక తీత పనులు చేపడుతున్నామని తెలిపారు. అనంతరం ఖేడ్‌లో గొల్లకురుమ సంఘం నియో జకవర్గ, మండలాల నూతన కార్యవర్గాలను అభినందించారు. నియోజకవర్గంలోని గొల్లకురుమల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట అధికారులు, నాయకులు ఉన్నారు.