
సత్వరమే అర్జీలు పరిష్కరించండి
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: ప్రజలు మనపై నమ్మకంతో అర్జీలు అందజేస్తున్నారు.. వెంట వెంటనే పరిష్కరించి సమాధానం ఇవ్వాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులకు సూచించారు. సోమ వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు 111 వినతులు అందజేశారు. ఇందులో అత్యధికంగా భూ సమస్యలపై 32, పెన్షన్ల కోసం 12, ఇందిరమ్మ ఇళ్లు 12, ఇతర సమస్యలపై 57 దరఖాస్తులు అందజేయగా, కలెక్టర్ స్వీకరించి మాట్లాడారు. అధికారులు సానుకూలంగా స్పందించి దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేటి నుంచి జిల్లాలో చేపట్టే ప్రత్యేక శానిటేషన్ డ్రైడేను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
వెల్దుర్తి(తూప్రాన్): వర్షాకాలంలో సీజనల్ వ్యాఽ దులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని మాసాయిపేటలోని పలు కాలనీల్లో ఆకస్మికంగా పర్యటించారు. పలు నివా సా ల వద్ద నీటి తొట్లు, పాత టైర్లలో నిల్వ ఉన్న నీటిని గుర్తించి సిబ్బందిచే పారబోయించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
ప్రజావాణికి 111 దరఖాస్తులు