
రసాభాసగా చెక్కుల పంపిణీ
హత్నూర(సంగారెడ్డి): హత్నూర రైతు వేదికలో శనివారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, రేషన్ కార్డుల పంపిణీ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే సునీతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభి షేకం చేసేందుకు సమావేశ మందిరంలోకి ఒక్కసారిగా వచ్చారు. దీంతో వెంటనే అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు వారిని అడ్డుకోవడానికి యత్నించగా, ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల నాయకులను బయటకు లాక్కెళ్లారు. ప్రజల సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీ తారెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్‌ను, మంత్రులను కూడా కలుస్తానని ఆమె స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తాను చేపట్టే కా ర్యక్రమాల విషయాలలో అధికార పార్టీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తుండటం సరికాదన్నారు.