
నాణ్యమైన బోధన అందించాలి
డీఈఓ రాధాకిషన్
చిన్నశంకరంపేట(మెదక్): విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి డీఈఓ రాధాకిషన్ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని మడూర్ జెడ్పీ పాఠశాలలో తెలుగు పండిత్‌లకు నిర్వహించిన కాంప్లెక్స్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు బోధన విషయంలో నైపుణ్యతను చాటి చెప్పాలన్నారు. తెలుగు ఉపాధ్యాయులకు ఉన్న ప్రత్యేక గుర్తింపును కాపాడుకోవాలన్నారు. పాఠ్యంశాలతో పాటు నీతి, ప్రేరణ కల్గించే కథలను విద్యార్థులకు చెప్పాలన్నారు. ప్రభుత్వం అందించిన డిజిటల్ బోర్డును ఉపయోగించుకోవా లని తెలిపారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ప్రతిభను పరిశీలించారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక తో ముందుకు సాగాలని సూచించారు. ఆయన వెంట కాంప్లెక్స్ హెచ్‌ఎం రవీందర్‌రెడ్డి ఉన్నారు.