
కార్పొరేట్‌కు దీటుగా సంక్షేమ హాస్టళ్లు
పాపన్నపేట(మెదక్): సంక్షేమ హాస్టళ్లు కార్పొరేట్‌కు దీటుగా ఉండాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన కొత్తపల్లి ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. ముందుగా విద్యార్థులతో మమేకమై వారి సా మ ర్థ్యాలను పరిశీలించారు. వసతి సౌకర్యా లు, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..? అని స్వయంగా అడిగి తెలుసుకున్నా రు. విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచిగా చదువుకొని సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.