
సీజనల్‌పై అప్రమత్తంగా ఉండాలి
టేక్మాల్(మెదక్): సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. బుధవారం మండలంలోని ఎల్లుపేటలో నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా నిర్మించే ఆస్పత్రి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆయన వెంట ప్రోగాం ఆఫీసర్స్ హరిప్రసాద్, నవ్య, వైద్యురాలు హర్షిత తదితరులు ఉన్నారు.
డీఎంహెచ్‌ఓ శ్రీరామ్