
రైల్వేలైన్ విస్తరణ !
గురువారం శ్రీ 31 శ్రీ జూలై శ్రీ 2025
● త్వరలో ప్రారంభం కానున్న పనులు
● జిల్లా వాసులకు తీరనున్న కష్టాలు
రామాయంపేట(మెదక్): మేడ్చల్– ముథ్కేడ్ మధ్య రైల్వేలైన్ విస్తరణకు అడుగులు పడుతున్నాయి. ఈమే రకు త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజె క్టు పూర్తయితే జిల్లా వాసుల కు వెసులుబాటు కలగనుంది. గంటల తరబడి రైళ్ల కోసం, క్రాసింగ్‌ల వద్ద వేచి ఉండే పరిస్థితికి చెల్లుబాటు కానుంది. ఇది ముథ్కేడ్, డోన్ డబ్లింగ్ ప్రాజెక్టు పరిధిలోకి వస్తుంది. ఇందుకు సంబంధించి 418 కిలోమీటర్ల మేర డబ్లింగ్ లైన్ నిర్మాణం కోసం రూ. 4,686 కోట్ల అంచనాతో నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఉన్న సింగిల్ లేన్‌తో ప్రయాణికులు ఇబ్బందులపాలవుతున్నారు. రెండు వరుసల లేన్‌కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. పలుమార్లు కేంద్ర మంత్రులు, ఎంపీలను కలిసి విన్నవించగా, ఎట్టకేలకే గతేడాది కేంద్రం నిధులు మంజూరు చేసింది. ప్రాధాన్యత క్రమంలో ఇప్పటికే మేడ్చల్ వరకు రెండో లేన్ నిర్మాణం పూర్తయింది. మరో వైపు నిజామాబాద్ నుంచి పుణ్యక్షేత్రమైన బాసర వరకు డబ్లింగ్ లేన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బాసర గోదావరి నదిపై భారీస్థాయిలో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. రెండేళ్ల లోపు రెండో లేన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
జిల్లాలో మనోహరాబాద్, వడియారం, పాలాట పోతారం, మీర్జాపల్లి, బ్రాహ్మణపల్లి, శ్రీనివాసనగర్, మాసాయిపేట, అక్కన్నపేట రైల్వేస్టేషన్లు ఉన్నాయి. జిల్లా పరిధిలో 41 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ విస్తరించి ఉంది. 2006లో ఈలైన్ మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజుకు మారింది. మూడేళ్ల క్రితం అక్కన్నపేట నుంచి మెదక్, మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు నూతనంగా రైల్వేలైన్ నిర్మించారు. దీంతో అక్కన్నపేట, మనోహరాబాద్ స్టేషన్లు జంక్షన్లుగా మారాయి. రెండో లేన్ నిర్మాణం పూర్తయితే జిల్లా పరిధిలో ఉన్న స్టేషన్ల రూపురేఖలు మారనున్నాయి. గతంలో ఎప్పుడో నిర్మించిన పలు స్టేషన్ల భవనాలు చాలా వరకు పాక్షికంగా శిథిలమయ్యాయి. వీటి స్థానంలో కొత్త భవనాలు, ప్లాట్‌ఫాంలు, అదనపు సదుపాయాలు కల్పించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్ నుంచి ముథ్కేడ్ వరకు రైల్వేలైన్‌ను పూర్థిస్థాయిలో విద్యుదీకరించారు. ఇదే విషయమై రైల్వేశాఖ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. మేడ్చల్ నుంచి ముథ్కేడ్ వరకు రెండో లేన్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. సర్వే గతంలోనే పూర్తి కాగా, ప్యాకేజీల వారీగా ప్రాధాన్యత క్రమంలో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం నిజామాబాద్, బాసర మధ్య డబ్లింగ్ లేన్ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
ఆటలు ఆడుతున్న విద్యార్థినులు
న్యూస్‌రీల్
మారనున్న స్టేషన్ల రూపురేఖలు

రైల్వేలైన్ విస్తరణ !

రైల్వేలైన్ విస్తరణ !

రైల్వేలైన్ విస్తరణ !