
పింఛన్ కోసం బారులు
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని పోస్టాఫీసు వద్ద ఆసరా పెన్షన్ కోసం లబ్ధిదారులు బారులు తీరారు. సోమవారం నుంచి పింఛన్ పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పోస్టాఫీసుకు చేరుకున్నారు. గతంలో బయోమెట్రిక్ రాని వృద్ధులకు గ్రామ కార్యదర్శి బయోమెట్రిక్‌తో పింఛన్ డబ్బులు వారి ఇంటికి వెళ్లి అందించేవారు. తాజాగా బయోమెట్రిక్‌రాని వారికి ముఖాన్ని స్కాన్ చేస్తుండటంతో వృద్ధులు కూడా పెన్షన్ తీసుకునేందుకు బారులు తీరారు. చిన్నశంకరంపేట(మెదక్):