కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌

Jul 30 2025 9:17 AM | Updated on Jul 30 2025 9:17 AM

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య మళ్లీ రగడ రాజుకుంది. మంగళవారం చిలప్‌చెడ్‌ రైతువేదికలో రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతారెడ్డి, గ్రంథాలయ చైర్‌పర్సన్‌ సుహాసిని రెడ్డి, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ హాజరయ్యారు. అనంతరం కాంగ్రెస్‌ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ జై కాంగ్రెస్‌ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా బీఆర్‌ఎస్‌ నాయకులు సైతం జై బీఆర్‌ఎస్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతం పరస్పర నినాదాలతో హోరెత్తింది. అధికార కార్యక్రమం కాస్త రసాభాసగా మారింది. వైరి వర్గాలు మొహరించడంతో ఉద్రిక్తత నెలకొంది.

కలెక్టర్‌కు ఎమ్మెల్యే కౌంటర్‌

రేషన్‌కార్డుల అనంతరం జరిగిన సభలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 9,941 రేషన్‌ కార్డులు పంపిణీ చేశామని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా అందించిదని వివరించారు. అలాగే రుణమాఫీ, బోనస్‌ ఇలా అనేక పథకాల గురించి వివరించారు. కలెక్టర్‌ వాదనను ఎమ్మెల్యే సునీతారెడ్డి సున్నితంగా తిరస్కరించారు. రేషన్‌ కార్డులు తీసుకునేందుకు కనీసం 10 మంది లబ్ధిదారులు సైతం లేరని ఎద్దేవా చేశారు. కలెక్టర్‌ తెలిపిన సంక్షేమ పథకాల్లో 60 శాతం కూడా రుణమాఫీ జరగలేదని, రైతులకు మరో రెండు రైతుభరోసాలు ప్రభుత్వం బాకీ ఉందన్నారు. సన్నాలకు బోనస్‌ లేదని, ఎరువుల కొరత ఎక్కువైందన్నారు. పలు గ్రామాలకు బస్సు సౌకర్యాలు లేక విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇది ప్రజా ప్రభుత్వమని ఏ అధికారైనా, నాయకుడైనా ప్రజల కోసమే పనిచేయాలని చురకలంటించారు.

పీఎం, ఎంపీల చిత్రపటాలకు పాలాభిషేకం

నర్సాపూర్‌ రూరల్‌ : మండలంలోని నాగులపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం గిరిజన హాస్టల్‌ మంజూరు చేసినందుకు మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌ గౌడ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్‌ యాదవ్‌, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్‌ గౌడ్‌ బీజేపీ నాయకులతో కలిసి పీఎం మోదీ, మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

రసాభాసగా రేషన్‌కార్డుల పంపిణీ హోరెత్తిన నినాదాలు.. ఉద్రిక్తత

ఇది ప్రజా కార్యక్రమం : ఎమ్మెల్యే సునీతారెడ్డి

ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

నర్సాపూర్‌ రూరల్‌: విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి గిరిజన విద్యార్థులకు సూచించారు. మంగళవారం నర్సాపూర్‌ మండలం నాగులపల్లి (బంజారా నగర్‌) జెడ్పీహెచ్‌ స్కూల్‌కు రూ 3.50 కోట్ల నిధులతో నిర్మించబోతున్న హాస్టల్‌ భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు కేంద్రమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. సునీతా రెడ్డి మాట్లాడుతూ.. రుస్తుంపేట శివారులో అసంపూర్తిగా వదిలేసిన గిరిజన బాలికల హాస్టల్‌ భవనం పూర్తి చేసేందుకు రూ.4 కోట్లు, నర్సాపూర్‌ నుంచి రుస్తుంపేట, నాగులపల్లి మీదుగా సికిందాలపూర్‌ రీ బీటింగ్‌ కోసం రూ 5.70 కోటు, మూసాపేట్‌ నుంచి దౌల్తాబాద్‌ వరకు రూ.కోటి, తుజాల్‌ పూర్‌, ఖాజీపేట్‌ రోడ్డుకు రూ .80 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement