
పక్షవాతంలో బాధపడుతున్నా..
నాది ఖమ్మం జిల్లా భద్రాచలం. పిల్లలు, కుటుంబం అక్కడే ఉంటున్నారు. సుమారు 400 కి.మీ నుంచి కొడుపాకకు ప్రమోషన్‌పై వచ్చా. 5 ఏళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నా. మనిషి తోడు లేనిదే ఉండలేను. ఎల్లప్పుడు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. పని మనిషి సహాయంతో జీవితం కొనసాగిస్తున్నాను. నెలకు రూ. 20 వేలు ఖర్చు చేసి మెదక్ నుంచి కారులో కొడుపాకకు వెళ్లి వస్తుంటాను. ప్రమోషన్లు ఇచ్చే ముందు జీరో సర్వీసు పెట్టి, బదిలీలు నిర్వహించాలి.
– ఆరోగ్యం, జీహెచ్‌ఎం, కొడుపాక ఉన్నత పాఠశాల