
సమస్యలపై నేరుగా సంప్రదించండి
నారాయణఖేడ్: సమస్యలపై ఖేడ్ డివిజన్ పరిధిలోని ప్రజలు తనను నేరుగా సంప్రదించి పరిష్కరించుకోవాలని, వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేయవచ్చని సబ్ కలెక్టర్ ఉమాహారతి సూ చించారు. ఖేడ్ ఆర్డీఓ కార్యాలయంలో సబ్ కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించి విలేకరులతో మాట్లాడారు. తాను వికారాబాద్‌లో శిక్షణపొందగా, శిక్షణలో భాగంగా వెనుకబడిన ప్రాంతాల సమస్యలను పరిశీలించానని తెలిపారు. వెనుకబడిన ఈ ప్రాంతానికి సబ్ కలెక్టర్‌గా నియామకమై అభివృద్ధికి పాటుపడే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. డివిజన్ పరిధిలోని సమస్యలు, ప్ర జల అవసరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పిల్లల డ్రాపౌట్లు లేకుండా చూస్తామన్నారు. ప్రాంత అవసరాలు, సమస్యలపై ఆధ్యయనం చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కాగా సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉమా హారతిని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఆర్డీఓ అశోకచక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, డీఎస్పీ వెంకట్‌రెడ్డి సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఆర్డీఓ కార్యాలయ అధికారులు, డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, వివిధపార్టీల నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు సన్మానించారు.
ప్రజలకు ఖేడ్ సబ్ కలెక్టర్
ఉమా హారతి సూచన
బాధ్యతల స్వీకరణ