
సమస్యల పరిష్కారానికి చర్యలు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ పాల్గొని ప్రజల నుంచి 18 వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రజావాణి నిర్వహించినట్లు తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్‌శాఖ పని చేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.
అదనపు ఎస్పీ మహేందర్