
వన దుర్గమ్మా.. కరుణించమ్మా
పాపన్నపేట(మెదక్): వన దుర్గమ్మా.. మము బ్రోవమ్మా అంటూ వేలాది మంది భక్తులు ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే ఆలయం వద్ద రద్దీ నెలకొంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం పోసి బోనాలు తీసి మొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు.
దూప్‌సింగ్ తండా బ్రిడ్జిని
సందర్శించిన అదనపు కలెక్టర్
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని వాడి పంచాయతీ పరిధి దూప్‌సింగ్ తండా వద్ద శనివారం వరకూ పొంగిపొర్లిన బ్రిడ్జి వద్ద వరద ఉధృతి తగ్గడంతో జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా తండావాసులతో మాట్లాడారు. వరద సమయంలో ప్రజలు అటువైపు వెళ్లకూడదని, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
ఓపెన్‌స్కూల్‌కు
దరఖాస్తు చేసుకోవాలి
పెద్దశంకరంపేట(మెదక్): ఓపెన్‌స్కూల్‌లో ఇంటర్మీడియెట్, ఎస్సెస్సీలో చేరేందుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని మండల ఓపెన్‌స్కూల్ కో ఆర్డినేటర్ విఠల్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎస్సెస్సీ, ఇంటర్‌లో చేరే అభ్యర్థులు మీసేవ లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మోదీ విధానాలపై
పోరాడాలి
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ పేర్కొన్నారు. సంగారెడ్డిలోని టీఎన్‌జీఓ భవన్‌లో ఆదివారం జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగవ మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. కార్మికులకు మద్దతుగా లేబర్ కోడ్‌లను రద్దు చేసే వరకు నిరంతరం పోరాడతామన్నారు. కార్మికులు నిరంతరం పనిచేస్తున్న పని భద్రత ప్రదేశాల్లో భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం కార్మికుల దోపిడీకి పాల్పడుతుందని మండిపడ్డారు.

వన దుర్గమ్మా.. కరుణించమ్మా

వన దుర్గమ్మా.. కరుణించమ్మా