
రాక పోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రమైన చేగుంటలోని మెదక్ రోడ్డులో రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆదివారం అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులతోపాటు ఆర్‌బీ అధికారులతో ఎంపీ మాట్లాడుతూ...రైల్వే గేటు మీదుగా ప్రతీరోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ సమయంలో ఈదారిలో వాహనాల రాకలపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 2న ఆర్వోబీ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. కార్యక్రమంలో రైల్వే సీనియర్ ఇంజనీర్ సాంబశివరావు, ఏఈ నమ్రియాల్ ఆర్ అండ్ బీ సర్దార్‌సింగ్, బీజేపీ నాయకులు గోవింద్, ఎల్లారెడ్డి, భూపాల్, పలు గ్రామాల బీజేపీ నాయకులు ఉన్నారు.
రైల్వే గేటు పరిశీలించిన ఎంపీ రఘునందన్