
పీఆర్సీ అమలు చేయాలి: టీపీటీఎఫ్
మెదక్‌జోన్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ఇవ్వకుండా జాప్యం చేస్తుందని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బుధవారం మెదక్ తహసీల్దార్‌కు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని, అన్నిరకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపచేయాలని, జీఓ 25ను సవరించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు యా దగిరి, శ్రీనివాస్‌రెడ్డి, నాచారం శేఖర్, సురేందర్, నాగరాజు, పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.