
జిల్లాలో ఎరువుల కొరత లేదు
చిన్నశంకరంపేట(మెదక్): జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. బుధవారం మండలంలోని గవ్వలపల్లిలోని ఎరువుల దుకాణాన్ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అలాగే సూరారం శివారులోని కోళ్ల పరిశ్రమను పరిశీలించి దాణాకు ఉపయోగిస్తున్న రసాయనాలపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల్లో యూరియాను నిల్వ చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీన్, డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్, ఆర్‌ఐ రాజు, ఏఈఓ నాగేందర్ తదితరులు ఉన్నారు.
అదనపు కలెక్టర్ నగేశ్