
క్రీడాకారులకు బహుమతుల ప్రదానం
మెదక్ కలెక్టరేట్: ఫుట్‌బాల్ క్రీడలో జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో పోటీపడి ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా అధికారులు మంగళవారం బహుమతుల ప్రదానంతోపాటు సర్టిఫికెట్లను అందజేశారు. జిల్లాలోని నర్సాపూర్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన సహస్ర రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. విద్యాశాఖ ఏఏంవో సుదర్శనం, జిల్లా స్పోర్ట్స్‌సెక్రెటరీ నాగరాజు, కోచ్ భాగ్య, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ ఆఫీసర్లు ఆమెను అభినందిస్తూ జ్ఞాపికను అందజేశారు. క్రీడల్లో రాణించి జాతీయస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఫుట్‌బాల్ క్రీడలో నైపుణ్యంతో మరింత రాణించి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు, కోచ్‌లు, ఆఫీసర్లు పాల్గొన్నారు.