
డ్రోన్.. పిచికారీలో సహాయకారి
జిల్లాలో తొలిసారి పంటలకు ఎరువులను డ్రోన్‌తో పిచికారీ చేశారు. రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో మంగళవారం ఇఫ్కో సంస్థ ఆధ్వర్యంలో తక్కువ ఖర్చుతో వరిపంటపై నానో యూరియాను పిచికారీ చేసి దానిపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. రైతులే స్వయంగా క్రిమి సంహారక మందులను పిచికారీ చేస్తే దీర్ఘకాలిక అనారోగ్యానికి గురవుతారని, డ్రోన్ సేవలతో ఈ సమస్యలు ఉత్పన్నం కావని వ్యవసాయాధికారులు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్, సహాకార సంఘం డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
–రామాయంపేట(మెదక్):