
రూ.9 వేల కోట్లతో సన్నబియ్యం
చేగుంట(తూప్రాన్): కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకోసం 9వేయిల కోట్లతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. చేగుంట బోనాల ఉత్సవాల సందర్భంగా మంగళవారం మహంకాళీ అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలను అమలు చేస్తున్నామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. అదేవిధంగా రూ.12 వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభించినట్లు వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.32 వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్లను ప్రాజెక్టుకు కేటాయించగా రీఇంజనీరింగ్ పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వందకోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రాజిరెడ్డి, అంజనేయులుగౌడ్, స్థానిక నాయకులు సండ్రుగు శ్రీకాంత్, నవీన్ తదితరులున్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి