
నిలిచిన పనులపై దృష్టి సారించండి
మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ హేమలత
మనోహరాబాద్(తూప్రాన్): కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షాలపై విమర్శలు మాని, గ్రామాల్లో నిలిచిపోయిన పనులపై దృష్టి సారించాలని మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ ర్యాకల హేమలత హితవు పలికారు. శుక్రవారం మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. మెదక్ పర్యటించిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి వివేక్ కేసీఆర్‌పై విమర్శలు చేశారన్నారు. కేసీఆర్ గ్రామాలు, జిల్లాల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ప్రతి మండలంలో ఆగిపోయిన సమీకృత భవనాలకు నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి వసతి కల్పించాలని, గ్రామ అవసరాలకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు. సమావేశంలో నాయకులు శేఖర్‌గౌడ్, భిక్షపతి, వెంకటేష్‌గౌడ్, రతన్‌లాల్, షఫీయోద్దీన్, శ్రీనివాస్, ఇర్ఫాన్‌ఖాన్, సాయికుమార్‌గౌడ్, నరేందర్‌గౌడ్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.